హైదరాబాద్ (జనంసాక్షి): తెలంగాణలోని స్థానిక ప్రజా ప్రతినిధులకు గొప్ప శుభవార్త. వారికి సముచిత గౌరవాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారి గౌరవ వేతనాలను భారీగా పెంచింది. స్థానిక ప్రజాప్రతినిధుల వేతనాలు పెంచుతున్నట్టు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రజాప్రతినిధుల గౌరవాన్ని పెంచడానికి వారి వేతనాలను పెంచుతున్నమని సీఎం తెలిపారు. జెడ్పీ చైర్మన్ల వేతనాలు నెలకు రూ.7,500 నుంచి రూ. 1లక్షకు, జెడ్పీటీసీలకు రూ.2,250 నుంచి 10వేలకు, ఎంపీపీలకు రూ. 1500 నుంచి రూ.10వేలకు, ఎంపీటీసీలకు రూ.750 నుంచి రూ.5 వేలకు, సర్పంచులకు రూ. 1500 నుంచి రూ.5 వేలకు, మేయర్లకు రూ.14వేల నుంచి 50 వేలకు, డిప్యూటీ మేయర్లకు రూ. 8 వేల నుంచి రూ. 25 వేలకు, కార్పొరేటర్లకు రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ చైర్మన్లకు రూ. 10 వేల నుంచి రూ. 15 వేలకు, డిప్యూటీ చైర్మన్లకు రూ. 5 వేల నుంచి రూ. 7500లకు, కౌన్సిలర్లకు రూ.2200 నుంచి రూ. 3500లకు, ఇతర మున్సిపల్ చైర్మన్లకు రూ. 8 వేల నుంచి రూ. 12 వేలకు, వైస్ చైర్మన్లకు రూ. 3200 నుంచి 5 వేలకు, కౌన్సిలర్లకు రూ. 1800 నుంచి రూ. 2500లకు పెంచారు. పెంచిన వేతనాలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయని చెప్పారు.
స్థానిక ప్రజా ప్రతినిధుల గౌరవం పెంపు




