
తీరు మార్చుకుంటే ఆలోచిస్తాం : పుతిన్
మాస్కో, (జనంసాక్షి) :
అమెరికా మోస్ట్ వాంటెడ్ ఎడ్వర్డ్ స్నోడెన్‌కు ఆశ్రయం ఇవ్వడంపై రష్యా తర్జనభర్జన పడుతుంది. అమెరికా నిఘా విభాగం మాజీ కాంట్రాక్టర్ స్నోడెన్‌కు ఆశ్రయం కల్పించే దేశాలపై ఆంక్షలు తప్పవని అగ్రరాజ్యం హెచ్చరించింది. అమెరికా సైబర్ గూఢచర్యాన్ని బయటపెట్టినందుకు, విశ్వసనీయమైన సమాచారాన్ని బయటపెట్టినందుకు స్నోడెన్‌ను విచారించనున్నట్లు అమెరికా ప్రకటించింది. ఆయన ప్రస్తుతం ఈక్వెడార్‌లో ఆశ్రయం పొందుతున్నారు. తనకు ఆశ్రయం కల్పించాల్సిందిగా స్నోడెన్ స్వతహాగా విజ్ఞప్తి చేసినా ఆశ్రయం ఇవ్వబోమని భారత్ సహా పలు దేశాలు పేర్కొన్నాయి. స్నోడెన్‌కు ఆశ్రయం ఇచ్చే అవకాశమున్నట్లుగా అనుమానిస్తున్న 30కి పైగా దేశాల ఎంబసీలపై నిఘా ఉంచిన అమెరికా ఇప్పుడు తన గూఢచర్యాన్ని మరింత తీవ్రతరం చేసింది. పౌర హక్కుల ఉద్యమకారుడిగా చెప్పుకుంటున్న స్నోడెన్ అమెరికా వ్యతిరేక చర్యలు మానుకుంటే ఆశ్రయం కల్పించే విషయం పరిశీలిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు.
స్నోడెన్‌కు ఆశ్రయంపై సందిగ్ధత




