స్పోర్ట్స్ స్కూల్లో మంత్రి ఆకస్మిక తనిఖీ
కడప,ఆగస్టు25(జనం సాక్షి ) : కడప రిమ్స్ సవిూపాన ఉన్న ఎపి స్పోర్ట్స్ స్కూల్లో రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులంతా మంత్రికి తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. స్కూల్‌ను పరిశీలించిన మంత్రి విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంపై స్కూల్ ప్రత్యేకాధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. స్కూల్‌లోని సమస్యలన్నీ పరిష్కరించి ఎపి స్పోర్ట్స్ స్కూల్‌ను బెస్ట్ స్పోర్ట్స్ స్కూల్‌గా తీర్చిదిద్దుతామన్నారు. బెస్ట్ ప్లేయర్స్ ఇక్కడి నుంచే దేశానికి ప్రతినిధ్యం వహించేలా అన్ని చర్యలు తీసుకుంటామని క్రీడాకారులకు భరోసానిచ్చారు. స్పోర్ట్స్ స్కూల్ లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు క్రీడా వసతులన్నీ ఏర్పాటు చేస్తామని మంత్రి హావిూ ఇచ్చారు. ఈ విషయంపై సిఎంతో, షాప ఎండితో చర్చిస్తామని పేర్కొన్నారు.