Wednesday, 4 November 2026

స్మార్ట్‌ ఫోన్‌ కొనివ్వలేదని బాలుడి ఆత్మహత్య

కడప,మే25(జ‌నంసాక్షి): స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వలేదని 15 ఏళ్ల బాలుడు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన కడప జిల్లా పెనగలూరు పరిధిలోని కంబాలకుంటలో చోటుచేసుకుంది. కోనేరు శేఖర్‌ అనే బాలుడు విష గుళికలను నీటిలో కలుపుకని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొన్నిరోజులుగా శేఖర్‌ తల్లిదండ్రులతో తనకు స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వాలని అడుగుతున్నాడు. కానీ తల్లిదండ్రులు తమ వద్ద డబ్బులు లేవని ఇంట్లో ఉన్నా చిన్నఫోన్‌ను వాడుకోవమని చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన శేఖర్‌ విష గుళికలను నీటిలో కలుపుకని తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు అతడిని వెంటనే రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శేఖర్‌ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.