హైదరాబాద్, సెప్టెంబరు 7 : స్మార్ట్‌సిటీలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆయా సిటీల నిర్మాణంలో భాగస్వాములను చేయాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కోరారు. నగరాలను స్మార్ట్‌సిటీలుగా మార్చడం కష్టమే కానీ అసాధ్యం కాదని ఆయన అన్నారు. స్మార్ట్‌సిటీలపై జరిగిన వర్క్‌షాప్‌ను మంత్రి వెంకయ్య ప్రారంభించారు. స్మార్ట్‌సిటీల నిర్మాణంలో కార్పొరేటర్లు, మేయర్ల పాత్ర కీలకమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రతీ విషయాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు. ఈ వర్క్‌షాప్‌లో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఏపీ మంత్రి నారాయణ, 40 స్మార్ట్‌సిటీల అధికారులు పాల్గొన్నారు
స్మార్ట్ సిటీలపై ప్రజలకు అవగాహన కల్పించాలి




