జిల్లాలో రిజర్వాయర్లను పరిశీలించిన మంత్రులు
అనంతపురం,మార్చి2(జనంసాక్షి): హంద్రీనీవా ఎన్టీఆర్ మానస పుత్రికని, ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం తమకే దక్కిందని ఆంధప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. హంద్రినీవా సుజల స్రవంతిని ఎన్టీఆర్ రూపకల్పన చేశారని, దాన్ని పూర్తి చేసే అవకాశం తమకు దక్కిందని దేవినేని ఉమ అన్నారు. హంద్రినీవా పనులను 15 రోజులకొకసారి సవిూక్షిస్తామని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. ప్రాజెక్టు పనులను ఆయన జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి పరిశీలించారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ 15 రోజులకోసారి కాలువపై పర్యటించి పనులు పూర్తయ్యేలా చూస్తామని వెల్లడించారు. 2018 జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని హావిూ ఇచ్చారు.అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. హంద్రినీవా పనులను త్వరలో పూర్తి చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్నారు. హంద్రినీవా సుజల స్రవంతి కాలువ పనులను మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాధరెడ్డి, దేవినేని ఉమ, ఎమ్మెల్యే బాలకృష్ణ తదితరులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ మాట్లాడుతూ గత కాంగ్రెస్ హయాంలో హంద్రీ-నీవా ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైందని అంటున్నారు. హంద్రీనీవా పనులు పూర్తి చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఆయన అన్నారు. అంతవరకు మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తామని కూడా ఆయన చెప్పారు.కాగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ హంద్రీనీవా ఎన్.టి.ఆర్.మానసిక పుత్రిక అని అన్నారు.దీనిని పూర్తి చేసే అవకాశం తమకు వచ్చిందని ఆయన అన్నారు. జీడిపల్లి రిజర్వాయర్‌ను కూడా ఆంధప్రదేశ్ పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత సందర్శించారు. గ్రామంలోకి నీరు వస్తున్నాయంటూ గ్రామస్థులు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సమస్యను భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమ చెప్పగా, త్వరలోనే పునరావాసం కల్పిస్తామని మంత్రి హావిూ ఇచ్చారు. హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ కూడా జీడిపల్లి రిజర్వాయర్‌ను సందర్శించిన బృందంలో ఉన్నారు. రాజధాని నిర్మాణం కోసం 32 వేల ఎకరాలు సవిూకరించినట్లు పేర్కొన్నారు. ఆంధప్రదేశ్ రాజధాని కోసం ఇప్పటికే 32వేల ఎకరాలను సవిూకరించినట్లు దేవినేని ఉమ పేర్కొన్నారు. అనంతపురం జిల్లాకు తాగు, సాగునీరు అందిస్తేనే కరవుసీమ అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతుందని పరిటాల సునీత ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం అనంతపురం జిల్లా అభివృద్దికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. అనంతపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారు. జిల్లాలో సరైన వర్షపాతం లేకపోవడం గత పదేళ్లుగా పరిపాలనలో ఉన్న ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడంతో జిల్లా ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారన్నారు. జిల్లాను అన్నిరకాలా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. అధికారులు జిల్లా అభివృద్దికి చేపట్టే అంశాలను సమన్వయంతో పనిచేయాలి. నీటివనరులు పెంపునకు నీటిపారుదల శాఖ అధికారులు కష్టపడి పని చేయాలి. జిల్లాలో పెండింగ్ పనులు సత్వరమే పూర్తిచేయాలన్నారు. అంతకుముందు అధికారులతో మంత్రి దృష్టికి తీసుకెళ్లే అంశాలపై చర్చించారు. జిల్లాకు మంత్రి పర్యటన వల్ల మేలు జరగాలన్నారు. ఈ సమావేశంలో హంద్రీనీవా ప్రాజెక్టు ఛీఫ్ ఇంజినీరు జలందర్, ఇతర ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఖాళీ బిందెలతో ప్రదర్శన
కరవు బారిన పడిన అనంతపురం జిల్లా సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే హంద్రీ నివా ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని హిందూపురంలో ఎస్‌యూసీఐ ఆధ్వర్యంలో సోమవారం పెద్దఎత్తున ప్రజలు ఖాళీబిందెలతో ప్రదర్శన నిర్వహించారు. స్థానిక సీఎండ్ఐజీ మిషన్ చర్చి ప్రాంగణం నుంచి ప్రారంభమైన ప్రదర్శన సద్భావన కూడలి విూదుగా సాగింది. ఈ ప్రదర్శనలో పాల్గొన్న ఎస్‌యూసీఐ నాయకులు గిరీష్, బస్వరాజ్, తదితరులు మాట్లాడుతూ హంద్రీనివా ప్రాజెక్టును వెంటనే పూర్తి చేస్తే ఈ ప్రాంతం ప్రజలకు, రైతులకు ఎంతో ఉపయోగపడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం వట్టిమాటలు కట్టిపెట్టి పనులు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్ఎంఎస్ సమావేశ భవనంలో సమావేశం నిర్వహించారు.




