Tuesday, 3 November 2026

పెవ్రేట్‌ రంగంలో పెరుగుతున్న అవకాశాలు: గంటా

విశాఖపట్టణం,మార్చి2(జ‌నంసాక్షి): విశాఖ ఐటి హబ్‌గానే గాకుండా స్మార్ట్‌ సిటీగా అవతరించబోతందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన నైపుణ్యాన్ని యువత పెంపొందించుకోవాలని అన్నారు. యువతకు అనేక అవకాశాలు వస్తున్నాయని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అనేక సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. ఇలాంటి తరుణంలో యువతకు ఈ రంగంలో మంచి ఉద్యోగ అవకాశాలు రానున్నాయన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు వర్సిటీ స్థాయిలో కోర్సుల్లో మార్పులు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. ఇదిలావుంటే ఉత్పత్తుల్లో సారూప్యం కలిగిన ఒకే తరహా పరిశ్రమల క్లష్టర్లకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తుందని నేషనల్‌ ప్రొడక్టవిటీ కౌన్సిల్‌ అధికారులు  తెలిపారు.  కేంద్ర ప్రభుత్వం సూక్ష్మ, లఘు, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ ఎంఎస్‌ఎంఈ ఆధ్వర్యంలో ప్రత్యేక పథకం ద్వారా పరిశ్రమల ఉత్పాదకత మెరుగుపర్చుకునేందుకు పెట్టుబడిలో 80 శాతం వరకు ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జపాన్‌ వంటి దేశాల్లో ఉత్పత్తి విధానాలను పరిశ్రమలు అమలు చేయాలని సూచించారు. వృథాను అరికట్టడం, ఆధునిక పద్ధతులను అవలంభించడం, పటిష్టమైన నిర్వహణ వ్యవస్థ ద్వారా మంచి ఫలితాలు వస్తాయన్నారు. 3.5 లక్షలు గరిష్ఠ పరిమితితో కేంద్రం సహకారం అందిస్తుందని వివరించారు. ఆసక్తి కలిగినవారు సంస్థ హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యలయంలో సంప్రదించాలని కోరారు. ప్రైవేట్‌ రంగంలోనూరిజర్వేషన్లు అమలుచేయాలని ఉద్యోగ నియామకాల్లో, ఉన్నత పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం కల్పించాలని  బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. వర్సిటీ చేపడుతున్న ఉద్యోగ నియామకాల్లో, పదోన్నతుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని వీసీని కోరారు. దీంతో పాటు బీసీల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. బీసీ పరిశోధకులకు, ఉద్యోగుల కోసం ఏయూలో బీసీ భవనం ఏర్పాటు చేయడంతో పాటు ఏయూ మహిళ ఇంజినీరింగ్‌ కళాశాలకు సావిత్రిబాయిపూలే పేరు పెట్టాలని వీసీని కోరారు.వర్సిటీ వేదికగా పూలే, అంబేద్కర్‌ అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేయాలని వీసీకి సూచించారు. ఈ ప్రతిపాదనలపై వీసీ జీఎస్‌ఎన్‌ రాజు సానుకూలంగా స్పందించారు. బీసీల సంక్షేమానికి బీసీ సంఘం తరఫనె చేస్తున్న కృషిని వీసీ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *