Tuesday, 3 November 2026

హత్యకేసు నిందితుడు రాంపాల్‌స్వామిజీ అరెస్టు

Untitled-1

ఆశ్రమంలో నలుగురు మహిళల మృతి

400 మందికిపైగా భక్తులు అరెస్టు

చండీఘర్‌, నవంబర్‌ 19 (జనంసాక్షి) : హత్యకేసులో నిందితుడు రాంపాల్‌స్వామిజీ అరెస్టు అయ్యాడు. వివాదాస్పద స్వావిూజీ రాంపాల్‌ ఆశ్రమంలో నలుగురు మహిళలు మృతి చెందారు. 400మందికిపైగా భక్తులను పోలీసులు అరెస్టుచేశారు. హర్యానా బల్వారా పట్టణంలోని వివాదాస్పద స్వావిూజీ రాంపాల్‌ ఆశ్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సత్యలోక్‌ ఆశ్రమ స్వావిూజీ రాంపాల్‌ హర్యానా పంజాబ్‌ ఉమ్మడి హైకోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీచేసింది. దీంతో స్వావిూజీని అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు ఆశ్రమానికి చేరుకున్నారు. స్వావిూజీని అరెస్ట్‌ చేసేందుకు వీలు లేదంటూ ఆయన భక్తులు, అనుచరులు పోలీసులతో ఘర్షణకు దిగారు. దీంతో స్థానికంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి భాష్పవాయువు ప్రయోగించారు. దాంతో పలువురు భక్తులు, అనుచరులు గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రులకు తరలించారు. సత్యలోక్‌ ఆశ్రమంలో మృతి చెందిన నాలుగురు మహిళ మృతదేహాలను ఆశ్రమ నిర్వహకులు తమకు అప్పగించారని ఆ రాష్ట్ర డీజీపీ ఎస్‌.ఎన్‌. వశిష్ట బుధవారం విూడయాకు వెల్లడించారు. ఆశ్రమంలో అనారోగ్యంతో ఉన్న మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా… వారు చికిత్స పొందుతూ మరణించారని చెప్పారు. మృతుల్లో ఏడాదిన్నర చిన్నారితోపాటు 70ఏళ్ల వృద్ధురాలు కూడా ఉందన్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం అఘోరాలోని మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మృతులు ఢిల్లీకి చెందిన సవిత (31), రోహితక్కి చెందిన సంతోష్‌ (45) బిజినోర్కు చెందిన రాజ్‌ బాల (70) పంజాబ్లోని సంగురూర్కి చెందిన మలికిత్‌ కౌర్‌ (50) గా గుర్తించినట్లు చెప్పారు. రామ్‌ పాల్‌ ఆచూకీ మాత్రం ఇంతవరకు లభ్యం కాలేదని తెలిపారు.

ఆశ్రమం వద్ద ఘర్షణలు

స్వావిూజీ రాంపాల్‌ను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌ హింసాత్మకంగా మారింది. ఆశ్రమం వద్ద ఆయన అనుచరులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో దాదాపు 200 మంది గాయపడ్డారు. వీరిలో స్వావిూజి అనుచరులు, విూడియా వారే కాకుండా పోలుసుకు కుడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ ఘటనలో ఒక జేసీబీ వాహనాన్ని ఆశ్రమవాసులు దగ్ధం చేశారు.కోర్టు ధిక్కరణ నేరం కింది స్వామి రాంపాల్‌పై బెయిల్‌కు వీల్లేని వారంటును జారీ చేసిన పంజాబ్‌, హర్యానా హైకోర్టు.. శుక్రవారంలోగా ఆయనను కోర్టుకు హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించింది. దాంతో పోలీసులు, పారా మిలటరీ బలగాలు మంగళవారం భారీ ఎత్తున స్వావిూజీ ఆశ్రమం వద్దకు చేరుకున్నారు. విూడియా కూడా భారీగా మోహరించింది. ఆశ్రమం లోపలికి వెళ్లి స్వావిూజీని అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలను రాంపాల్‌ అనుచరులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఎస్‌ఐ మెడలోకి దూసుకు పోయిన బుల్లెట్‌

స్వామి రాంపాల్‌ అనుచరులు పోలీసుల సిడ్‌ సీసాలు, పెట్రోలు బాంబులు, రాళ్లతో దాడి చేశారని రాష్ట్ర డీజీపీ ఎస్‌ఎన్‌ వశిష్ట్‌ తెలిపారు. పెట్రోలు పోసుకుని ఆత్మాహుతి చేసుకునేందుకు వారు చేసిన ప్రయత్నాన్ని వాటర్‌ కానన్లతో అడ్డుకున్నామన్నారు. వారి వద్ద పిస్టళ్లు, రివాల్వర్లు, ఇతర మారణాయుధాలు ఉన్నాయన్నారు. వారి దాడిలో చాలామంది పోలీసులు గాయాల పాలయ్యారని, ఒక ఏఎస్‌ఐ మెడలోకి బుల్లెట్‌ దూసుకుపోయిందని వివరించారు. పోలీసులు కూడా టియర్‌ గ్యాస్‌ షెల్స్‌, వాటర్‌ కానన్లతో స్వావిూ రాంపాల్‌ అనుచరులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.

2006 లో జరిగిన కాల్పులు, హత్య కేసులో నిందితుడైన బాబా రాంపాల్‌కు కోర్టు ఎన్నోసార్లు సమన్లు జారీ చేసింది. అయినా ఆయన కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారంట్‌ జారీఅయింది. పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేయకుండా ఆయన ప్రైవేట్‌ సైన్యం ఎప్పటికప్పుడు అడ్డు పడుతూ వచ్చింది. అరాచక శక్తుల అడ్డాగా రాంపాల్‌ ఆశ్రమం మారిందన్న ఆరోపణలు వచ్చాయి. కోర్టు ధిక్కారానికి పాల్పడిన ఈ బాబాను పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. శుక్రవారం లోగా ఈయనను అరెస్టు చేయాలని పంజాబ్‌-హర్యానా హై కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడంతో మంగళవారం ప్రభుత్వ ఆదేశాలపై ఖాకీలు ఈ బాబాను అరెస్ట్‌ చేయడానికి యత్నించారు. కాగా..తాజా పరిస్థితి పై చర్చించేందుకు హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ తన మంత్రివర్గ సహచరులతో అత్యవసరంగా సమావేశమయ్యారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *