జ
మ్మూ-కశ్మీరులోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ మరోసారి తెగబడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జరిపిన కాల్పుల్లో ముగ్గురు భారతీయ సైనికులు అమరులయ్యారు. ఒక జవాను మృతదేహాన్ని దారుణంగా ఛిద్రం చేశారు. జమ్మూ-కశ్మీరులోని మచల్ సెక్టర్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ఇటువంటి దారుణం జరగడం ఒక నెలలో ఇది రెండోసారి. దీనిపై భారత్ స్పందిస్తూ ప్రతీకారం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. భారతీయ జవాన్ల మృతదేహాలను ఛిద్రం చేయడం ఈ ఏడాది ఇది రెండోసారి.
హద్దులు దాటిన పాకిస్తాన్




