Tuesday, 3 November 2026

హామీలన్నీ అమలు చేశాం

C 99 శాతం పూర్తి చేశాం

-కేజీ టూ పీజీ మినహా

– తెలంగాణకు నేను నీళ్లోద్దంటానా!?

– ముస్లిం రిజర్వేషన్లకు కట్టుబడ్డాం

– శాసన సభలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,మార్చి13(జనంసాక్షి): తమ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న 99 శాతం హావిూలను నెరవేర్చిందని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. కేజీ టు పీజీ మినహా మిగతా వాటిని నెరవేర్చామని వివరించారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వాళ్లు ఇచ్చిన హావిూలను నెరవేర్చలేదని విమర్శించారు. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యావాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఇవాళ ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 2009లో మేనిఫెస్టోలో ఇచ్చిన హావిూ మేరకు రైతులకు విద్యుత్‌ సరిగా సరఫరా చేయకుండా, సాగునీటిని అందించకుండా పొలాలను ఎండబెట్టారని మండిపడ్డారు. ప్రతీ వ్యక్తికి ఆరు కిలోల రేషన్‌ బియ్యం ఇస్తామని ఎగబెట్టారని ఇవాళ తమ ప్రభుత్వం ఆ పని చేస్తోందని స్పష్టం చేశారు. ప్రతీ ఇంటికి గ్యాస్‌ కనెక్షన్‌ ఇస్తామని మాట తప్పారని దుయ్యబట్టారు. గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పెంచారని గుర్తు చేశారు. నాలుగేళ్లలో గుడిశెలు లేని ఏపీని చేస్తామని మాట తప్పారని మండిపడ్డారు. ఆనాడు వాళ్లు ఆ పని చేసి ఉంటే ఇవాళ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పథకం చేపట్టే అవసరం ఉండేది కాదన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చుతామని మాట తప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ తమ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం త్వరలో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చుతుందని స్పష్టం చేశారు. రైతులకు తమ ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్‌ ఇస్తోన్న సంగతి ప్రపంచానికి తెలుసన్నారు.

తెలంగాణకు నీళ్లు రాకుండా నేను చేసుకుంటనా?: సీఎం

హైదరాబాద్‌: తెలంగాణకు నీళ్లు రాకుండా నేను చేసుకుంటనా అని సీఎం కేసీఆర్‌ అన్నారు. గవర్నర్‌ ప్రసంగం తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన నేడు శాసనమండలిలో ప్రసంగించారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తూ మహారాష్ట్రతో కేసీఆర్‌ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్న విపక్షాల విమర్శలపై సీఎం స్పందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణకు నీళ్లు రాకుండా నేను చేసుకుంటనా? అవసరమైతే ఇంకో 10 టీఎంసీలు ఎక్కువ తెచ్చుకుంటం. పారదర్శకంగా, నిజాయితీగా పనిచేసి నీళ్లు తెచ్చుకుంటం. తెలంగాణ నీటిపారుదల నిపుణులు హెలికాప్టర్లలో కృష్ణా, గోదావరి బేసిన్‌లో పర్యటించారు. అవమానాలన్నీ తట్టుకొని నిలబడ్డాం కాబట్టే తెలంగాణ తెచ్చుకోగలిగాం. గత పాలకుల నిర్లక్ష్యంతో నీళ్లు దిగువకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కుట్రతో తమ్మిడిహట్టి, ప్రాణహిత-చేవెళ్లను అంతర్రాష్ట్ర వివాదాల్లో ఇరికించారు. చైర్మన్‌, స్పీకర్‌ పర్మిషన్‌తో ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై ఉభయసభల్లో ఒకరోజు పెద్ద స్క్రీన్‌పై సభ్యులందరికీ వివరిస్త. ప్రాణహిత, ఇంద్రావతి తప్ప తెలంగాణకు నీళ్లు వచ్చే అవకాశం లేదు. 600 మంది సాయుధ పోలీసులను పెట్టి తెలంగాణ వారిని జైల్లో పెట్టించి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పులిచింతల ప్రాజెక్టు కట్టించిండు. పోతిరెడ్డిపాడుకు పొక్కపెట్టి..సాయుధ బలగాలతో పులిచింతల కట్టిన్రు. అగ్రిమెంట్‌ లేకుండా ప్రాజెక్టు ఎలా కడతారని మహారాష్ట్ర సీఎం చౌహాన్‌.. కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. కుట్రతో తమ్మిడిహట్టి, ప్రాణహిత-చేవెళ్లను అంతరాష్ట్ర వివాదాల్లో ఇరికించారు. ప్రాణహిత రూపాయి ఖర్చు లేకుండా గోదావరిలో కలుస్తుంది. తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ లేదు. వైఎస్‌ రూ. 8 వేల కోట్లతో టన్నెల్‌ తవ్వించిన్రు. అంతర్‌రాష్ట్ర ప్రాజెక్టులు కట్టాలంటే అంతర్‌రాష్ట్ర బోర్డులుండాలి. లెండి కట్టడానికి అభ్యంతరం లేదని మహారాష్ట్ర చెప్పింది. తెలంగాణ ఏర్పడేనాటికి పొరుగు రాష్ట్రాలతో సంబంధాలు తెగిపోయాయి. మేడిగడ్డ దగ్గర 20 టీఎంసీల ప్రాజెక్టు వస్తది. మొత్తం 250 టీఎంసీల నీటి సామర్థ్యంతో గోదావరి నదిపై ప్రాజెక్టులొస్తయి. మహారాష్ట్ర, కర్నాటక 400 ప్రాజెక్టులు కట్టినయి. ఈసారి ఎస్‌ఆర్‌ఎస్‌పీలో ఒక్క చుక్క నీరు రాలేదు. ఇంత కరువులో కూడా మేడిగడ్డ దగ్గర నుంచి 1460 టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంలో కలిసినయి. మేడిగడ్డ ప్రాజెక్టుతో అవసరమైతే ఎస్సారెస్పీ నింపుకుంటం. పాములపర్తి, ఉద్దండపూర్‌ ప్రాజెక్టులను 620 విూటర్ల ఎత్తులో కడ్తమని సీఎం పేర్కొన్నారు.

నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నాం: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ 2009లో మేనిఫెస్టోలో ప్రకటించిన హావిూలను ఎందుకు నెరవేర్చలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశ్నించారు. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సీఎం సమాధానమిస్తూ కాంగ్రెస్‌ నేతలపై ప్రశ్నల వర్షం కురిపించారు. గవర్నర్‌ ప్రసంగం తెరాస మేనిఫెస్టో అని అనటం మనల్ని మనమే అపహాస్యం చేసుకోవటమేనని.. తెరాస మేనిఫెస్టోను గవర్నర్‌ ప్రసంగం ప్రతిబింబించకపోతేనే సరైంది కానట్లు అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ హయాంలో పారిశ్రామికవేత్తలు విద్యుత్‌కోసం ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా చేశారని, ప్రస్తుతం పరిశ్రమలకు 24గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని వివరించారు. పరిశ్రమలకు, సాగుకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ హయాంలో తండాలను గ్రామపంచాయతీలుగా మారుస్తామని హావిూ ఇచ్చి మరిచారని విమర్శించారు.

మిషన్‌ భగీరథను కచ్చితంగా పూర్తి చేస్తాం

మిషన్‌ భగీరథను కచ్చితంగా పూర్తి చేసి, తెలంగాణ ప్రజలకు నీరందిస్తామని రాష్ట్ర సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రాజెక్టులను సమైక్య రాష్ట్రంలో ఒక ఎత్తుగడతో అడ్డుకున్నారని ఆరోపించారు. ‘అంతర్‌ రాష్ట్ర వివాదాల్లో ఇరికించడం తొలి ఎత్తుగడ. లోయర్‌ పెన్‌గంగను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు నిర్మించలేదు. ఒక వేళ అంతర్రాష్ట్ర వివాదాల్లో ఉంటే మరింత జఠిలం చేయడం రెండు ఎత్తుగడ. అప్పులు తెస్తున్నారంటూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ప్రభుత్వంలో ముందస్తు ప్రణాళిక రూపొందిస్తోంది. ప్రణాళిక అనుగుణంగా నిధుల సమకూర్పుపై ఆలోచిస్తున్నాం. ఈ క్రమంలోనే బడ్జెట్‌ రూపకల్పన ఉంటుంది. ఎస్‌ఎల్‌బీసీ పనులు అడ్డుకున్నారు. వైఎస్‌ సాయుధ పోలీసులను పెట్టి పులిచింతల నిర్మించారు. తెదేపా, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పొరుగు రాష్ట్రాలతో వ్యతిరేక భావజాలాన్ని పెంచారు. తెరాస ప్రభుత్వ పొరుగు రాష్ట్రాలతో సుహృద్భావ వాతావరణ ఏర్పరిచింది. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటామని మహారాష్ట్రతో చెప్పాం. విూరు బతకండి.. మమ్మల్ని బతకనివ్వండని చెప్పి చర్చలు మొదలుపెట్టాం. 35ఏళ్లలో తొలిసారిగా సింగూరు ఎండిపోయింది. ఈ ఏడాది ఎస్‌ఆర్‌ఎస్‌పీకి చుక్కనీరు రాలేదు. మేడిగడ్డ నుంచి 1,400 టీఎంసీలు సముద్రంలోకి వృథాగా పోయాయి. ఎగువ రాష్ట్రాల్లో 400 బ్యారేజీలు నిర్మాణం చేశారు. గత పాలకుల చర్యల వల్ల రాష్ట్రానికి ప్రాణహిత, ఇంద్రావతి మాత్రమే దిక్కుగా మిగిలాయి. నిజాంసాగర్‌, నిండితీరాలి ఎస్‌ఆర్‌ఎస్‌పీ నిండాలి. కరీంనగర్‌, నల్గొండ, వరంగల్‌ జిల్లాలను సస్యశ్యామలం చేసేలా చర్యలు చేపట్టాం. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఇంటర్‌ స్టేట్‌ కంట్రోల్‌ బోర్డు ఏర్పాటు చేశాం. ఈనెల 19న ఇంటర్‌ స్టేట్‌ కంట్రోల్‌ బోర్డు సమావేశం నిర్వహిస్తాం. లోయర్‌ పెన్‌గంగ, లెండి ప్రాజెక్టులకు త్వరలో టెండర్లు పిలుస్తాం’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

వైయస్‌ అన్యాయం చేస్తే కూర్చున్నారేం

దివంగత వైయస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఆయన హయాంలో అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ నేతలు చూస్తూ కూర్చుండిపోయారని తెలంగాణ సీఎం కెసిఆర్‌ ఆదివారం శాసన సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ అన్యాయం చేస్తుంటే ఇప్పుడు ప్రశ్నించే కాంగ్రెస్‌ నేతలు ఎందుకు ప్రశ్నించలేదని ప్రశ్నించారు. వైయస్‌ రాజశేఖర రెడ్డి పులిచింతలను కట్టారని, పోలవర్‌ హెడ్‌ రెగ్యురేటరీ ఎత్తు పెంచారన్నారు. తెలంగాణకు కాంగ్రెస్‌ పార్టీయే తీవ్ర అన్యాయం చేసిందన్నారు. 35 ఏళ్లలో తొలిసారి సింగూరు ఎండిపోయిందని చెప్పారు. లోయర్‌ పెన్‌ గంగాను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. కర్నాటక, తమిళనాడులు 400 బ్యారేజీలు కడుతుంటే సీమాంధ్ర పాలకులు ఏం చేశారని ప్రశ్నించారు. ఐఅఖీ కుట్రతో వివాదాల్లో ఇరికించారు తుమ్మిడిహెట్టి, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును సీమాంధ్ర పాలకులు వివాదంలో ఇరికించారన్నారు. తుమ్మిడిహెట్టిని వివాదంలో ఇరికించిన సీమాంధ్ర పాలకులు దవళేశ్వరం తరలించుకుపోయారన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును తాము వ్యతిరేకించటామన్నారు. తాము అప్పులు తెస్తున్నామని విపక్షాలు విమర్శించడం విడ్డూరమన్నారు. పలు ప్రాజెక్టులను అంతర్రాష్ట్ర వివాదంలో ఇరికించారన్నారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసిన వైయస్‌ రాజశేఖర రెడ్డిలో జీవన్‌ రెడ్డికి దేవుడు ఎలా కనిపించాడని నిలదీశారు. అవసరమైతే మేడిగడ్డతో ఎస్సారెస్సి నింపుకోవచ్చన్నారు. మహారాష్ట్రతో ఒప్పందం బ్లాక్‌ డేనా వాస్తవాలను కాంగ్రెస్‌ నేతలు భరించలేకపోతున్నారన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ప్రాజెక్టులపై ఒప్పందం బ్లాక్‌ డే ఎలా అవుతుందని కాంగ్రెస్‌ నేత జీవన్‌ రెడ్డిని ప్రశ్నించారు. చారిత్రక ఒప్పందాన్ని బ్లాక్‌ డే అంటారా అని నిలదీశారు. ఈ నెల 19న సమావేశానికి మహారాష్ట్ర సీఎంను ఆహ్వానించామని చెప్పారు. లివ్‌ అండ్‌ లెట్‌ లివ్‌ పద్ధతిలో మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ప్రాణహిత, ఇంద్రావతి తప్ప తెలంగాణకు నీళ్లు వచ్చే పరిస్థితి నిన్నటి వరకు లేదన్నారు. ఎవరు ఏమన్నా ప్రజలు ఇచ్చిన హావిూ మేరకు 2018 వరకు మిషన్‌ భగీరథను పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్‌ నేతల తీరు తలదించుకునేలా ఉంది లోయర్‌ పెన్‌ గంగా, లెండి ప్రాజెక్టులకు త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. కాంగ్రెస్‌ నేతలు తెలంగాణ రాష్ట్రానికి నష్టం వచ్చేలా మాట్లాడవద్దన్నారు. కాంగ్రెస్‌ నేతల తీరు తలదించుకునేలా ఉందన్నారు. నాకు పాలమూరు జిల్లా కష్టాలు తెలుసునని చెప్పారు. అన్నింటికి కాంగ్రెస్‌దే బాధ్యత.. ఇంకా చాలా చెప్పాలి తెలంగాణకు జరిగిన అన్యాయానికి బాధ్యత అంతా కాంగ్రెస్‌ పార్టీదే అన్నారు. సీమాధ్ర ముఖ్యమంత్రుల కింద ఊరేగింది కాంగ్రెస్‌ పార్టీ నేతలు అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టింది తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అన్నారు. మహారాష్ట్రకు మేం తాకట్టుబడ్డామని మాట్లాడుతారా అని భగ్గుమన్నారు. తెలంగాణ వెనుకబాటుకు కాంగ్రెస్‌ పార్టీయే కారణమన్నారు. ఇంకా చాలా విషయాలు చెప్పాల్సి ఉందన్నారు. ఇటీవల జరిగిన పలు ఎన్నికల్లో విపక్షాలకు ప్రజలు గట్టి బుద్ధి చెబుతున్నారన్నారు. అయినప్పటికీ తాము విపక్షం అనే గౌరవం ఇస్తున్నామన్నారు. విపక్షాలు పిచ్చిగా చేయవద్దన్నారు. ధనిక రాష్ట్రమే.. ఎవరి చరిత్ర ఏమిటో చెప్తా తెలంగాణ పునర్నిర్మాణంలో విపక్షాలు భాగస్వామ్యం కావాలన్నారు. దేశం ముందు తెలంగాణ పరువు తీయవద్దన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమేనని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తాను ఇచ్చిన ఒక్క హావిూ నెరవేర్చలేదన్నారు. చిన్నారెడ్డి ప్రాజెక్టుల పైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కెసిఆర్‌ భగ్గుమన్నారు. సమైక్య రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రుల కింద ఊరేగింది విూరేనని కాంగ్రెస్‌ నేతలు జీవన్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, చిన్నారెడ్డిలపై మండిపడ్డారు. వాస్తవాలు చెప్పడం ఏకపక్షం కాదన్నారు. ఎవరి చరిత్ర ఏమిటో ఆధారాలున్నాయని, అన్నీ చెప్తానని అన్నారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఎలా కడతారని మహారాష్ట్ర సీఎం చౌహన్‌.. నాడు సమైక్య ఏపీ చివరి సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డికి లేఖ రాశారన్నారు. ఎవరి మాటా వినను తాను అనుకున్నది చేసి తీరుతానని, ప్రజలకు మేలు జరుగుతుందని భావించే పనుల విషయంలో వెనుకంజ వేయబోనని, ఎవరి మాటా వినేది లేదన్నారు. మిషన్‌ భగీరథ, వాటర్‌ గ్రిడ్‌, మెట్రో ప్రాజెక్టు, మహారాష్ట్రతో చేసుకున్న జల ఒప్పందాలు, రహదారుల అభివృద్ధి, కొత్త జిల్లాల ఏర్పాటు వంటి ఎన్నో అంశాలను ఆయన ప్రస్తావించారు. ప్రతిదానిని విమర్శించడం విపక్షాలకు పనిగా మారిపోయిందన్నారు. మంచి పనికి సహకరించాలన్న ఇంగిత జ్ఞానం వారికి లేకపోయిందన్నారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే దిశలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందడుగేనన్నారు. విద్యుత్‌ ఉద్యోగుల వివాదాలకు ఏపీ అధికారులే కారణమన్నారు. ప్రజలకు అధునాతన వైద్య సేవలను అందించే దిశగా, ఇప్పటికే పలు రాష్ట్రాలు, విదేశాల్లోని ఆసుపత్రులను పరిశీలించి వచ్చామని, త్వరలో గంజినీరు తాగే పేదకు కూడా కార్పొరేట్‌ వైద్యం అందుతుందన్నారు. వైద్యానికి ఉన్న ప్రాధాన్యతను గమనించి, గత సంవత్సరం కన్నా మరిన్ని నిధులు కేటాయించాలని ఆర్థికమంత్రికి సూచించామని తెలిపారు. ఇంజనీరింగ్‌ కాలేజీల్లో అక్రమాలు పెరిగిపోయాయని, త్వరలోనే వాటికి పులుస్టాప్‌ పెడతామన్నారు. అనంతరం అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.

సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు

సంక్షేమానికి అగ్రతాంబూలం వేశాం. కాంగ్రెస్‌ హయాంలో రూ.200 పింఛను ఇస్తే మేము రూ.1000 ఇస్తున్నాం.

కాంగ్రెస్‌ హయాంలో 29లక్షల మందికి పింఛన్లు ఇస్తే.. మా హయాంలో ప్రభుత్వం 35.7లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. బీడీ కార్మికులకు రూ.1000 జీవన భృతి కల్పిస్తున్నాం.

ఖర్చుకు వెనుకాడకుండా సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సన్నబియ్యం అన్నం పెడుతున్నాం. వచ్చే సంవత్సరం నుంచి కళాశాలలు, యూనివర్సిటీ హాస్టళ్లలో కూడా అమలు చేస్తాం.

పింఛన్లు, రేషన్‌ కార్డులు పెంచాం, బీడీ కార్మికులను ఆదుకుంటున్నాం.

బంగారుతల్లి పథకం మేము అమలు చేయం.. చేయదలచుకున్నదే చెబుతాం.

తొలి విడతలో 50శాతం రైతు రుణాలు మాఫీ చేశాం. ఈ బడ్జెట్‌ కేటాయింపులతో మలివిడత 75శాతం పూర్తవుతాయి.

దూరదృష్టితో మేము తీసుకున్న నిర్ణయం వల్ల విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా రైతులకు పంపిణీ చేశాం.

త్వరలో 21 లక్షల మెట్రిక్‌ టన్నులు నిల్వ చేసుకునేలా త్వరలో అందుబాటులోకి గోదాంలు తీసుకొస్తాం.

రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం సాహసోపేతమైన నిర్ణయం. పేదలు కూడా ఆత్మగౌరవంతో బతకాలి. బ్యాంకులతో ముడిపెడితే పేదలకు ఇళ్లు అందవు.

కొంత ఖర్చు ఎక్కువైనా.. ప్రైవేటుతో ముడిపెట్టి ఇళ్ల నిర్మాణం చేపట్టాం. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ఇళ్లు కట్టించేందుకు ముందుకు వచ్చారు.

లబ్ధిదారుల ఎంపిక బాధ్యత కలెక్టర్లకే అప్పగించాం. లబ్ధిదారుల ఎంపికలో ఒక్క పొరపాటు జరిగినా సంబంధిత అధికారులపై వేటు వేస్తాం.

హైదరాబాద్‌లో ఆర్టీసీ నష్టం రూ.218 కోట్లు. ఆర్టీసీని పటిష్ట పరిచి లాభాల బాటలో నిలుపుతాం. ఆర్టీసీ బలోపేతానికి రూ.700 కోట్లు ఇచ్చాం. పేదలకు ఉండే ఏకైక రవాణా వ్యవస్థ ఆర్టీసీ.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా టీఎస్‌ఐపాస్‌ తీసుకొచ్చాం. సుమారు రూ.33వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాం.

జహీరాబాద్‌ నిమ్స్‌కు కేంద్రం నుంచి అనుమతి వచ్చింది.

వైద్యులు, పారామెడికల్‌ పోస్టులు భర్తీ చేస్తాం. వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న అన్ని ఖాళీలు నింపుతాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *