మద్దతు పలికిన దీదీ
పునరేకీకరణ దిశగా జనతా పరివార్
న్యూఢిల్లీ డిసెంబర్22 (జనంసాక్షి): ఎన్నికల ముందు ఇచ్చిన హావిూలను నెరవేర్చడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ విమర్శించారు. ఇవాళ ‘జనతా పరివార్’ ఆధ్వర్యంలో మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితీష్‌కుమార్ మాట్లాడుతూ వందరోజుల్లో నల్లధనాన్ని వెనక్కుతెస్తామన్న హావిూని ప్రధాని మోదీ నిలబెట్టుకోలేక పోయారని మండిపడ్డారు.
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్‌యాదవ్, జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్, ఐఎన్‌ఎల్‌డీ చీఫ్ ఓమ్ ప్రకాశ్ చౌతాలా ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ ఆందోళనకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా మద్దతు పలికారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆరు పార్టీలు కలిసి ఆందోళనను నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ ర్యాలీలో జనతాపరివార్ కార్యకర్తలు భారీ సంఖ్యంలో పాల్గొన్నారు.





