Tuesday, 3 November 2026

హావిూల అమలులోసర్కార్‌ విఫలం: వైకాపా

గుంటూరు,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను అమలు చేయటంలో తెలుగుదేశం ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా విమర్శించారు. కావాలనే తమపార్టీకి చెందిన వారిని చేర్చుకుంటూ వైకాపాను దెబ్బతీయాలని చూస్తున్నారని అన్నారు. దీంతో టిడిపి బలపడుతందనుకుంటే భ్రమే కాగలదని అన్నారు. పేద, బడుగు బలహీనవర్గాలు ఎక్కువగా ఉన్న తూర్పు నియోజకవర్గంపై ప్రభుత్వం నిధులు కేటాయించకుండా వివక్ష చూపుతోందని విమర్శించారు. అయినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పోరాడుతానన్నారు. బలహీనవర్గాల అభివృద్ధిని పట్టించుకునే స్థితిలో ప్రభుత్వం లేదన్నారు. ప్రపంచ దేశాలను చుట్టివస్తోన్న సీఎం చంద్ర బాబుకు పేదల కాలనీల్లోని సమస్యలు తెలియడం లేదని విమర్శించారు.