హైదరాబాద్ : కూకట్‌పల్లి వివేకానందనగర్ కాలనీలోని పద్మజ హాస్టల్‌లో ఓ యువకుడిని దుండగులు హత్య చేశారు. గురువారం ఉదయం హాస్టల్లో యువకుడి మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండటంతో సహచరులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని… హత్య జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఆ తర్వాత పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి… దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా హాస్టల్ సిబ్బందిని విచారిస్తున్నారు. అయితే ప్రేమ వ్యవహారమే హత్యకు దారి తీసి ఉండవచ్చు అని పోలీసులు భావిస్తున్నారు. మృతుని వివరాల కోసం ఆరా తీస్తున్నారు.




