రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్‌సాగర్‌లో జలకళ సంతరించుకొంది. హుస్సేన్‌సాగర్‌లో వరద ఉద్థృతి పెరుగుతున్నందున వెంటనే అప్రమత్తమైన అధికారులు తూములు తెరిచి నీటిని వదిలేందుకు ఏర్పాట్లు చేశారు. ముందు జాగ్రత్తగా హుస్సేన్‌సాగర్ దిగువ భాగాన ఉన్న బస్తీవాసులను అధికారులు అప్రమత్తం చేశారు.
పొంగిపొర్లుతున్న మూసీ
నల్లగొండ జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మూసీ నది పొంగిపొర్లుతోంది. మూసీ ప్రవాహానికి బూదాన్ పోచంపల్లిలోని చెరువులు, కుంటలు నిండాయి. మూసీ పొంగి పొర్లుతుండటంతో నల్గొండ జిల్లా భట్టుగూడెం, రుద్రవెళ్లి, ముక్తా అనంతారం తదితర గ్రామాల మధ్య రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది.




