Monday, 2 November 2026

హెచ్‌సీయూ విద్యార్థుల దీక్షలో పాల్గొన్న రాహుల్‌


7హైదరాబాద్‌: రోహిత్ మృతికి నిరసనగా హెచ్ సీయూలో విద్యార్థులు చేపట్టిన సామూహిక దీక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా ఆందోళనను మరింత ఉధృతం చేశారు. దీక్ష స్థలికి అర్ధరాత్రి రాహుల్ గాంధీ చేరుకున్నారు. పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ మృతికి కారుకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. విద్యార్థుల దీక్షకు సంఘీభావంగా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శుక్రవారం అర్థరాత్రి నుంచి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రోహిత్‌ తరపున న్యాయం కోసం పోరాడేందుకే హైదరాబాద్‌ వచ్చినట్లు చెప్పారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడి జీవితం అర్థాంతరంగా ముగిసిందన్నారు. సాయంత్రం వరకు రాహుల్‌గాంధీ దీక్షలో పాల్గొనున్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్‌ పి.ఎ.సంగ్మా, రోహిత్‌ తల్లి రాధిక, సోదరుడు రాజు, విద్యార్థులు దీక్షలో పాల్గొన్నారు.

రోహిత్ మృతికి సంతాపంగా విద్యార్థులు అర్ధరాత్రి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. ఇవాళ రోహిత్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్నారు. నేడు ఒక రోజు రాహుల్ దీక్షలో పాల్గొననున్నారు. ఇన్ చార్జీ వీసీ శ్రీవాస్తవ్ సెలవుపై వెళ్లడంతో అతని స్థానంలో కొత్త వీసీగా పెరియ స్వామి నియామించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడారు.. ఆ వివరాలను వారి మాటల్లోనే..

దళితులుపై కేంద్రం, బిజెపి కుట్ర

దళితులుపై కేంద్రం, బిజెపి కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. దళితులను చంపడం కేంద్రం, బిజెపి కోసం స్కెచ్ వేసింది. హంతకుడైన వీసీని కాపాడడం కోసం ఐదు వేల మంది జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోంది. రోహిత్ హత్యకు కారణమైన వీసీ అప్పారావును తొలగించాలి. వీసీని లీవ్ లో పంపిండం దుర్మార్గమైన చర్య. దళితులపై దాడులకు పాల్పడే వారికి వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తమను సస్పెండ్ చేసినప్పుడు డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించాము. విచారణను 18 కి వాయిదా వేసింది. అనంతరం రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. మమ్మల్లి చంపడం కోసం కేంద్రం, బిజెపి, ఎబివిపి, వీసీ అప్పారావు స్కెచ్ వేశారు. రెండో వీసీ విపిన్ శ్రీవాత్సవ్ పై ఆరోపణలున్నాయి. 2008 సంత్సరంలో సెంథిల్ కుమార్ అనే దళిత విద్యార్థి హత్యకు విపిన్ శ్రీవాత్సవ్ కారకుడు.

ఇటీవల తమ ఐదుగురిని బహిష్కరించిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సబ్ కమిటీలో శ్రీవాత్సవ్ సభ్యుడు.. అంతేకాదు,.. ఆ కమిటీకి చైర్ పర్సన్ కూడా. అలాంటి వ్యక్తిని మళ్లీ తీసుకొచ్చి వీసీగా నియమించడం దారుణం. తాము అతన్ని వ్యతిరేకించన తర్వాత ఇంచార్జీ వీసిగా ఉండే శ్రీవాత్సవ్ ను సెలవులపై పంపారు. మొదటగా వీసీ అప్పారావును సస్పెండ్ చేసి, అరెస్టు చేయాలి. ఆ తర్వాత రోహిత్ మృతికి కారణమైన మిగిలిన హంతకులపై చర్యలు తీసుకోవాలి. దళితులకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద కేసు నమోదు చేయాలి. రోహిత్ చనిపోకముందు తమ సస్పెన్సన్ పై ఎంపీ కవితకు విన్నవించాము… పరిశీలిస్తామని చెప్పింది.. కానీ తర్వాత రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తర్వాత కవిత స్తబ్ధంగా ఉన్నది. ఘటనపై సీఎం చంద్రబాబు ఎలాంటి స్పందన లేదు.

హంతకులతో చర్చలకు సిద్ధంగా లేము

శ్రీవాత్సవ్ తమతో చర్చలకు ఒకసారి వచ్చారు. హంతకులతో చర్చలకు తాము సిద్ధంగా లేము. చర్చలకు సిద్ధంగా ఉన్నాము.. కానీ హంతకులతో చర్చలకు సిద్ధంగా లేము. పెరియ స్వామి వీసీగా బాధ్యతలు తీసుకుంటున్నారు. అందులో తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. తాము పెట్టిన ఏ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించడం లేదు. వీసీని సెలవుపై పంపడం దారుణం. విద్యార్థుల మనోభావాలతో చెలగాటం ఆడుతున్నారు. అప్పారావు, శ్రీవాత్సవ్ లు దళిత వ్యతిరేకులు.

విద్యార్థుల డిమాండ్లు…

రోహిత్ మృతికి కారకుడైన వీసీ ఆప్పరావును తొలగించాలి..

అప్పారావును అరెస్టు చేయాలి..

రోహిత్ కుటుంబానికి రూ. 50 లక్షలు ఇవ్వాలి..

రోహిత్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి..
మాపై ఎలాంటి షరతులు పెట్టకుండా బహిష్కరణను ఎత్తి వేయాలి’.. అనే డిమాండ్లతో ఆందోళన చేపట్టారు. డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం ఆగదని పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *