హైదరాబాద్: హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పోలీసులు నిర్వహించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో 12 చోట్ల పోలీసుల తనిఖీలు చేశారు. మద్యం తాగి వాహనం నడిపిన పలువురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 146 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 86 బైక్‌లు, 60 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా రేసింగ్‌లకు పాల్పడిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 19 బైక్‌లు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్, 142 మందిపై కేసు బంపర్ ఆఫర్




