Wednesday, 4 November 2026

హైదరాబాద్‌లో బర్డ్ ఫ్లూ

 రెండు లక్షల కోళ్లు వధ..

గుడ్లు, మాంసం తినరాదని హెచ్చరిక..!

 picpccaq
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న హయత్‌నగర్ ప్రాంతంలోని కోళ్ళ ఫారాలలో ఉన్న కోళ్ళకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకింది. అకారణంగా 20 వేల కోళ్లు మృతి చెందడంతో అనుమానించిన పౌల్టీ నిర్వాహకులు అధికారులకు సమాచారం ఇచ్చారు. 
దీంతో అక్కడి చేరుకున్న పశువర్ధక శాఖ అధికారులు, వైద్యులు పౌల్టీలో ఉన్న కోళ్లను పరిక్షించగా వాటికి బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఫ్లూ సోకిన రెండు లక్షల కోళ్ళను పెద్ద గుంట తీసి పూడ్చేయాలని అధికారులు నిర్ణయించారు. 
హయత్ నగర్ ప్రాంతలో కోళ్ళకు బర్డ్ ఫ్లూ వచ్చిందన్న విషయం తెలుసుకుని హైదరాబాద్ చుట్టుపక్కల వున్న కోళ్ళ ఫారాల యజమానులు అప్రమత్తమై తమ కోళ్ళ ఫారాలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరూ చికెన్, కోడిగుడ్లు తినరాదని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. బర్డ్‌ఫ్లూ పై రాష్ట్రవ్యాప్తంగా పశుసంవర్ధక శాఖ హైఅలర్ట్ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *