– గోదావరి జలాలను గరిష్టంగా వినియోగించుకోవాలి
– సీఎం కేేసీఆర్ సమీక్ష
హైదరాబాద్, అక్టోబర్12(జనంసాక్షి):
హైదరాబాద్ మహానగరానికి రెండు జలాశయాలను నిర్మిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. గోదావరి జలాలను గరిష్టంగా వినియోగించుకోవాలని,
రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో మంచినీరు, డ్రైనేజీ, రహదారుల నిర్మాణంపై అధికారులతో ఆయన సవిూక్షించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నిధుల మంజూరుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతి ఇంటికి మంచినీరు అందేలా కార్యచరణ రూపొందించాలన్నారు. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణాల్లో బలహీన వర్గాల్లో గృహ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమివ్వాలని సీఎం అన్నారు. మౌలిక వసతుల కల్పను నిధుల మంజూరుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. హైదరాబాద్ నగర మంచినీటి అవసరాల కోసం రెండు జలాశయాలను నిర్మిస్తామన్నారు. ప్రతీ ఇంటికి మంచినీటిని అందించేలా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. అక్రమ నిర్మాణాలు, కట్టడాల నియంత్రణకు కృషి చేస్తామన్నారు. పట్టణాల్లో బలహీన వర్గాల గృహ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భూగర్భ డ్రైనేజి వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు.
కెసిఆర్‌కు అలయ్ భలాయ్ ఆహ్వానం
క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కలిశారు. ఈ నెల 23న జలవిహార్‌లో నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి సీఎంను దత్తాత్రేయ ఆహ్వానించారు. అలయ్ బలయ్‌కి హాజరయ్యేందుకు సీఎం సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.





