Tuesday, 3 November 2026

హైదరాబాద్‌-మేడారం హెలికాప్టర్‌ సేవలు ప్రారంభం

వరంగల్‌: మేడారం మహాజాతరకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ సేవలను గురువారం తెలంగాణ శాసనసభ సభాపతి మధుసూదనాచారి ప్రారంభించారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో సభాపతి, పర్యాటకశాఖ కార్యదర్శి వెంకటేశం దంపతులు మేడారం జాతరకు బయలుదేరారు. ఇవాళ, రేపు హెలికాప్టర్‌ సేవలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. హైదరాబాద్‌-మేడారం, వరంగల్‌-మేడారం వరకు హెలికాప్టర్‌ సేవలు అందించనున్నారు. వరంగల్‌ నుంచి మేడారం వరకు ఒకరు వెళ్లి రావడానికి టికెట్‌ ధర రూ.26,500లుగా నిర్ణయించారు. హైదరాబాద్‌-మేడారం నలుగురికి ప్యాకేజీ ధర రూ.2,75,000లు గా నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *