Monday, 2 November 2026

హైదరాబాద్ లో పరిస్థితి కంట్రోల్ ఉంది

ghmc-ktr-review

హైదరాబాద్ లో పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందన్నారు మంత్రి కేటీఆర్. ఎలాంటి పుకార్లను నమ్మొద్దని సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం అంతటా వర్షం తగ్గుముఖం పట్టిందన్నారు. పలు శాఖల అధికారులు ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరిస్తున్నారని చెప్పారు. అంటు వ్యాధులు ప్రబలకుండా వ్యాక్సినేషన్ జరుగుతోందన్నారు. వరద పరిస్థితిపై జీహెచ్ఎంసీ ఆఫీసులో మంత్రి కేటీఆర్ రివ్యూ నిర్వహించారు. పలువురు మంత్రులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *