హోదా కోసం రాజీనామాలు చేయడం గర్వకారణం
అనంత వంచన సభలో మిధున్ రెడ్డి
అనంతపురం,జూలై2(జనం సాక్షి ): రాష్ట్ర ప్రయోజనాల కోసమే మమల్నిరాజీనామ చేయాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించారని మాజీ ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. రాషట్ర ప్రయోజనాల కోసం రాజీనామా చేశామన్న తృప్తి మిగిలిందన్నారు. రాజకీయాల కోసం గాకుండా హోదా కోసం రాజరీమా చేయడం నిజంగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర విభజన చట్టంలోని హావిూల సాధన విషయంలో చంద్రబాబు మోసపూరిత వైఖరి, కేంద్ర ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా తలపెట్టిన ‘వంచనపై గర్జన’ దీక్షలో మిథున్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు సిగ్గు లేకుండా మరో అవకాశం ఇవ్వాలని ప్రజలను అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో బాబు విఫలమయ్యారని ఆరోపించారు. రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేశారన్నారుప్రత్యేక ¬దా, విభజన హావిూల కోసం మరిన్ని పోరాటాలు చేస్తామన్నారు. ప్రత్యేక ¬దా కోసం రాజీనామ చేయడం గర్వంగా ఉందని విథున్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. అశోక్ బాబు తీరు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుందని దూషించారు. ఉద్యోగులు, పెన్షనర్ల సొమ్ముపై చంద్రబాబు కన్ను పడిందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రూ.200 కోట్లను అమరావతికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అన్నారు.