Tuesday, 3 November 2026

ఎన్‌సీపీ-కాంగ్రెస్‌కు పట్టుమని 10 సీట్లే : మోడీ

2
మహరాష్ట్ర, అక్టోబర్‌ 12 (జనంసాక్షి) : మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌-ఎన్సీపీలకు పట్టుమని పది సీట్లకు మించి రావని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్ల ఉద్దేశించి మాట్లాడుతూ ‘మీరు ఎన్సీపీ పార్టీ సింబల్‌ను చూశారా? అందులో 10 గంటల 10 నిమిషాలు సూచించేలా ఉంటుంది. దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసా?. దానర్థం కాంగ్రెస్‌, ఎన్సీపీలు కలిసి 10 సీట్లకు మించి గెలవలేవు’. అంటూ మోదీ ఎద్దేవా చేశారు. రాష్గాన్ని 15 సంవత్సరాల పాటు ఎన్సీపీ లూటీ చేసిందని వారికి వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయమని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎన్నికల ర్యాలీలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆదివారం పాంధార్‌ పూర్‌ పట్టణంలో ర్యాలీ చేపట్టిన మోదీ.. శరద్‌ పవార్‌ పార్టీకి ఓటేస్తే అవినీతి పెరుగిపోతుందన్నారు. ‘ఎన్సీపీ సహజంగానే అవినీతి పార్టీ. పార్టీ పుట్టక నుంచి ఆ పార్టీ వైఖరిలో ఏ మాత్రం మార్పు రాలేదు.ఇప్పటికే అవినీతిలో మునిగిపోయిన ఆ పార్టీ నేతలు.. మళ్లీ అధికారం ఇస్తే అవినీతిని మరింత ఉధృతం చేస్తారు’ అని మోదీ విమర్శించారు. ‘ఆ పార్టీ గుర్తు గడియారానికి కొత్త భాష్య చెప్పారు మోదీ. ఆ పార్టీ గుర్తు వారి 10 సంవత్సరాల్లో చేసిన అవినీతి చూపెడుతుందని మోదీ ఎద్దేవా చేశారు. ఈ పది సంవత్సరాల్లో 10సార్లు అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డ ఎన్సీపీకి మళ్లీ అధికారం ఇస్తే.. మళ్లీ 15సార్లు ముంచుతారని మండిపడ్డారు. ప్రజల కలలకు సాకారం చేసుకోవడానికి తాను హావిూ ఇస్తున్నాని బీజేపీకి ఓటేసీ అధికారంలో తీసుకురావలని మోదీ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *