Tuesday, 3 November 2026

నేడు జీవోఎం చివరి సమావేశం

12 నుంచి అసెంబ్లీ

భారీగా ఉద్యోగ నియామకాలు

నిజాం షుగర్‌ ఫ్యాక్టరీపై మంత్రివర్గ ఉపసంఘం

మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాలపై మరో ఏడాది నిషేధం పొడిగింపు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 3 (జనంసాక్షి) :

రెండున్నర నెలల సుదీర్ఘ విరామం తర్వాత భేటీ అయిన రాష్ట్ర మంత్రి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈనెల 12 నుంచి శాసనసభ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం మూడున్నర గంటల పాటు జరిగింది. భారీగా ఉద్యోగ నియమాకాలు చేపట్టాలని నిర్ణయించింది. మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాలపై మరో ఏడాది నిషేధం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ భేటీ అనంతరం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ, కమిషనర్‌ దానకిశోర్‌తో కలిసి మీడియాతో మాట్లాడింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తికి రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదించింది. 13 శాఖల్లో ఖాళీగా ఉన్న 13,388 ఉద్యోగాల భర్తీకి కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. ఐసీడీఎస్‌లో 8,900, అటవీశాఖలో 3,820 ఉద్యోగ నియామకానికి ఆమోద ముద్ర వేసింది. కొత్త నియామకాలతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 2,400 కోట్ల అదనపు భారం పడనుంది. అలాగే 13 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీనికోసం నిధులు విడుదల చేయనుంది. ఇదిలావుంటే వివాదస్పద చిత్తూరు జిల్లా తాగునీటి పథకంపై రాష్ట్ర కేబినెట్లో చర్చ జరిగినట్లు సమాచారం. తాగునీటి పథకంపై టెండర్ల ఖరారు అంశాన్ని కేబినెట్లో ప్రతిపాదించారు. చిత్తూరు జిల్లా తాగునీటి పథకంపై అవతకవలు జరిగాయని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్‌ టెండర్లను ఖరారు చేసేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉండగా, సత్పవ్రర్తన కలిగిన జీవిత ఖైదీల విడుదల మార్గదర్శకాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 0 నుంచి 39 శాతం వరకూ అంగవైకల్యం ఉన్నవారికి రూ.200 మేర పింఛన్‌ను అందించేందుకు కేబినెట్‌ ఆమోదం లభించింది. మావోయిస్టులతోపాటు ఏడు తీవ్రవాద సంఘాలపై…మరో ఏడాది నిషేధం పొడిగింపుకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మావోయిస్టు దాడుల్లో చనిపోయిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంపునకు, జీహెచ్‌ఎంసీలో మున్సిపల్‌ చట్టసవరణ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *