Tuesday, 3 November 2026

కేబినెట్‌ కీలక నిర్ణయాలు

సిద్ధమైన ముసాయిదా

రెండు రాష్ట్రాలకు ఒకే గవర్నర్‌

సీమాంధ్ర రాజధానికి భారీ ప్యాకేజీ

ఐఐటీ, ఏయిమ్స్‌ తరహా సంస్థల ఏర్పాటు

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 3 (జనంసాక్షి) :

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో తలెత్తే సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన మంత్రుల బృందం బుధవారం చివరిసారిగా భేటీ కానుంది. మంగళవారం సమావేశమైన మంత్రుల బృందం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ముసాయిదాను సిద్ధం చేసింది. రెండు రాష్ట్రాలకు ఒకే గవర్నర్‌ను కొనసాగించాలని, సీమాంధ్రలో ఏర్పాటు చేయబోయే కొత్త రాజధానికి భారీ ప్యాకేజీ ఇవ్వాలని, ఐఐటీ, ఏయిమ్స్‌, ఐబీఎం తరహా విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని నివేదికలో సూచించింది. మంగళవారం నార్త్‌బ్లాక్‌లో గంటన్నరపాటు జరిగిన జీవోఎం సమావేశానికి కేంద్ర మంత్రులు సుశీల్‌ కుమార్‌ షిండే, జైరాం రమేష్‌, నారాయణస్వామి, ఆంటోనీ, చిదంబరం, ఆజాద్‌, న్యాయశాఖకు చెందిన అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర విభజన అంశంపై వీరంతా చర్చించినా తుది నిర్ణయానికి రాలేకపోయారు. విభజన అంశాల్లో కొన్నింటిపై జీవోఎం సభ్యులు ఒక అభిప్రాయానికి రాలేకపోయారని సమాచారం. వివిధ అంశాలపై మంత్రుల మధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. దీంతో మరోమారు సమావేవమై చర్చించాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) బుధవారం మరోసారి భేటీ కానుంది. విభజన విషయంలో కొన్ని అంశాలపై సరియైన అభిప్రాయానికి రాలేకపోయారని, అందుకే మరోసారి సమావేశమవుతున్నామని జీవోఎం సభ్యుడు గులాం నబీ ఆజాద్‌ తెలిపారు. రాయల తెలంగాణ లేదా తెలంగాణ అన్నదానిపై ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది. దీనిపై సుదీర్ఘంగా మరోమారు చర్చించాక ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గురువారం కేంద్ర కేబినేట్‌ సమావేశం జరుగనున్నందున దీనికి ముందు అంటే బుధవారం తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదిలావుంటే ఢిల్లీలో ఇరు ప్రాంతాల నేతలు బిజీగా ఉన్నారు. జీవోఎంకు నేతృత్వం వహిస్తున్న కేంద్ర ¬ంమంత్రి సుశీల్‌కుమార్‌షిండేతో సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు పళ్లంరాజు, కావూరి సాంబశివరావు, జేడీ శీలంలు సమావేశమయ్యారు. ఆంధప్రదేశ్‌ పునర్‌ వ్యవ్థసీకరణ బిల్లుపై వారు పలు ప్రతిపాదనలు చేసినట్టు తెలిసింది. రాయల తెలంగాణతో పాటు పలు అంశాలను మరోమారు ప్రస్తావించారు. హైదరాబాద్‌ యూటీపై వారు మరోమారు సూచనలు చేశారని తెలుస్తోంది. ఇదిలావుంటే బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో తెలంగాణ ఐకాస సభ్యులు భేటీ అయ్యారు. కోదండరామ్‌ నేతృత్వంలో సభ్యుల బృందం రాయల తెలంగాణ వ్యవహారంపై చర్చించారు. పది జిల్లాల తెలంగాణకు మాత్రమే మద్దతు ఇవ్వాలని కోరారు. రాయల పేరుతో పార్లమెంటులో బిల్లును తీసుకువస్తే వ్యతిరేకిస్తామని రాజ్‌నాథ్‌ హావిూ ఇచ్చినట్టు వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *