విజయవాడ,ఆగస్టు 8(జ‌నం సాక్షి): అలనా పాలనా చూసేవారులేక వృద్ద దంపతులు ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన బుధవారం కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది. కృష్ణ జిల్లా ముసునూరు మండలంలో ముసునూరు గ్రామానికి చెందిన కొమ్మన రామదాసు(90), అచ్చమాంబ(80) అనే వృద్ధ దంపతులకు బిడ్డలున్నప్పటికీ తమను చూసే వారు లేరని మనస్తాపంతో నిన్న రాత్రి పురుగుల మందు తాగారు. గమనించిన స్థానికులు వారిద్దరినీ ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారిద్దరూ బుధవారం మరణించారు. వృద్ధ దంపతులకు ఎంతమంది పిల్లలు తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

తాజావార్తలు