విశాఖ, మార్చి 21 : విశాఖ జిల్లాలో రెండు వేర్వేరు సంఘటనల్లో 130 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. చీడికాడ మండలం బైలపూడిలో 40 కిలోలు, మాడుగుల మండలం ఎం.కోటపాడులో 90 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.




