ఆకివీడు: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ఉప్పుటేరు వద్ద ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద మంగళవారం పోలీసులు చేసిన తనిఖీల్లో రూ. 13.50లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై యార్లగడ్డ రవికుమార్ ఇచ్చిన వివరాల మేరకు కృష్టాజిల్లా మచిలీపట్నం నుంచి ఉండి మండలం చెరుకువాడ వెళ్తున్న చేపల వ్యాపారి నడింపల్లి అస్సలరాజు నుంచి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. దీనిని కోర్టులో అప్పగిస్తామని, ఆధారాలు చూపించి తిరిగి సొమ్మును తీసుకోవచ్చని తెలిపారు.




