140స్థానాల్లో తెదేపాదే గెలుపు

– వైసీపీకి ఓటేస్తే.. బీజేపీకి వేసినట్లే
– ప్రజాస్వామ్యంపై జగన్‌కు విశ్వాసం లేదు
– విలేకరుల సమావేశంలో మంత్రి కళావెంకట్రావ్‌
విజయనగరం, సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి) : వచ్చే ఎన్నికల్లో 140 సీట్లు గెలిచి, మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి కళా వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీకి ఓటేస్తే.. బీజేపీకి ఓటేసినట్లేనని వ్యాఖ్యానించారు. ఈ నెల 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని వివరించారు. జగనేమో పాదయాత్రలో ఉన్నారని చెప్పారు. ఆయన రాకపోగా ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి వెళ్లనీయడం లేదని ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అవసరం ప్రతీ ఎమ్మెల్యేపై ఉందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంపై జగన్‌కి విశ్వాసం లేదన్నారు. అసెంబ్లీ బహిష్కరణ ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిందన్నారు. స్వలాభం కోసమే జగన్‌ పార్టీ నడుపుతున్నారని విమర్శించారు. విభజన హావిూలు మోదీ నెరవేర్చకపోయినా.. వైసీపీ మాత్రం వారితో చీకటి ఒప్పందం చేసుకుని ముందుకెళ్తోందన్నారు. విద్యుత్‌ శాఖలో అనేక సంస్కరణలు తెచ్చామని మంత్రి తెలిపారు.
—————————–

తాజావార్తలు