Tuesday, 3 November 2026

15న జనసేన-లెఫ్ట్‌ పార్టీల ఉమ్మడి సభ

విజయనగరం,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): సిపిఎం-సిపిఐ-జనసేన ల ఆధ్వర్యంలో ఈ నెల 15 న నిర్వహించనున్న ‘ ప్రత్యామ్నాయ రాజకీయ సభ ‘ వాల్‌ పోస్టర్లను గురువారం విడుదల చేశారు. కురుపాం నియోజకవర్గ కేంద్రంలో కురుపాం స్నేహితుల సేవా సంఘం కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ఈ నెల 15 న నిర్వహించనున్న ప్రత్యామ్నాయ రాజకీయ సభను గిరిజన, ఉద్యోగ, ఉపాధ్యాయ, మహిళా, యువత, కార్మిక సంఘాలు, ప్రజలు కలిసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ డివిజన్‌ కార్యదర్శి ఆర్‌బి ఎస్‌.కుమార్‌, సిపిఎం పార్వతీపురం జిల్లా కార్యదర్శి వేదమూర్తి, సిపిఎం జిల్లా నాయకులు లక్ష్మణ మూర్తి, అవినాష్‌, జనసేన నాయకులు కె.మల్లేష్‌, వంశీ, శ్రీరామ్‌, సిపిఐ నాయకులు కృష్ణమూర్తి లు పాల్గొన్నారు.