Thursday, 5 November 2026

15 వరకు జగన్‌ పాదయాత్ర

ఏలూరు,జూన్‌9(జనం సాక్షి ): ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శుక్రవారం వైకాపా అధినేత జగన్‌ విరామం ఇచ్చారు. కోర్టుకు హాజరయ్యేందుకు ఆయన హైదరాబాద్‌ వెళ్లారు. దీంతో మల్లీ యాత్ర శనివారం ప్రారంబం కానుంది. జిల్లాలో చేపట్టిన పాదయాత్రకు అనూహ్య స్పందన వచ్చిందని ఆ పార్టీ నరసాపురం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. నరసాపురం నియోజకవర్గంలో డెల్టా అధునికీకరణ, బియ్యపుతిప్ప హార్బర్‌, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తానని జగన్‌ హావిూ ఇచ్చారన్నారు. జగన్‌ పాదయాత్ర జిల్లాలో ఈనెల 15న ముగుస్తుందని చెప్పారు. అనంతరం గడపగడపకు కార్యక్రమం ప్రారంభమతుందన్నారు.