
హైదరాబాద్, ఏప్రిల్ 8 (జనంసాక్షి) :
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలం గాణ ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారిగా పర్యటిం చనున్నారు. ఈనెల 15న కరీంనగర్‌లో నిర్వ హించనున్న ఎన్నికల బహిరంగ సభలో ఆమె పాల్గొంటారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏ ర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ చూపిన చొరవతో పాటు తెలంగాణ ప్రజలకు కరీంనగర్ గడ్డమీద ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని ప్రకటిం చనున్నారు. 2004లో కరీంనగర్‌లో నిర్వహిం చిన పార్టీ ఎన్నికల ప్రచార సభలో సోని యా గాంధీ పాల్గొన్నారు. తనకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలేమిటో తెలుసని, దాన్ని నెరవే రుస్తా నని ప్రకటించారు. దశాబ్దకాలం తర్వాత సోని యాగాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పా టు చేసి తెలంగాణలో అడుగుపెడ ుతు న్నారు. తెలంగాణ ఇచ్చేందుకు సీమాంధ్ర ప్రాంతంలో పార్టీ నష్టపోయినా లెక్కచేయకుం డా తాము ముందుకెళ్లామని కాంగ్రెస్ పార్టీ అ భ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని ఆమె ఓట ర్లను కో రనున్నారు. తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తామని హామీ
ఇచ్చిన ఉద్యమపార్టీ అధినేత కేసీఆర్ మాట తప్పారనే విషయాన్ని కూడా ఈ వేదికపై నుంచే సోనియాగాంధీ ప్రస్తావించనున్నారు. 15న కరీంనగర్‌లో నిర్వహించే సభకు స్థానిక ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, ముఖ్య నాయకులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
15న కరీంనగర్‌లో సోనియా బహిరంగ సభ




