Tuesday, 3 November 2026

నా చావు మీ చేతుల్లో లేదు


భౌతిక దాడులకు
భయపడను : కేజ్రీవాల్‌
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8 (జనంసాక్షి) :
తన చావు ఎవరి చేతుల్లోనూ లేదని, ఒక్క భగవంతుడి చేతిలోనే ఉందని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజీవ్రాల్‌ అన్నారు. భౌతికదాడులకు
తాను భయపడోనని ఆయన తేల్చిచెప్పారు. ఇటీవల కేజీవ్రాల్‌ను ఓ కార్యకర్త చెంపదెబ్బ కొట్టిన ఘటన మరవక ముందే మంగళవారం ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని సుల్తాన్‌పూర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజీవ్రాల్‌పై ఓ ఆటో డ్రైవర్‌ దాడికి యత్నించాడు. ముందుగా ప్రచారంలో కేజ్రీవాల్‌కు పూలమాల వేసిన అతను వెంటనే చెంపదెబ్బ కొట్టాడు. దీంతో వెంటనే స్పందించిన ఆప్కార్యకర్తలు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తనను కొడితే సమస్యలు పరిష్కారం అవుతాయా అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. ఒకవేళ అవుతాయంటే తాను దెబ్బలకు వెనకాడన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *