Tuesday, 3 November 2026

మరో 2 రోజులు వర్షాలు

విశాఖపట్నం : నైరుతి రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఆది, సోమరావారాల్లోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనావేస్తోంది. రుతు పవనాలు ఇప్పటి వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యేవి. ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి విస్తరించి చురుగ్గా కదలడంతో వర్షాలు భారీగా కురుస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితలావర్తనం ఇలహీన పడింది. దీని ప్రభావం రాష్ట్రంపై ఇక పెద్దగా ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా ఉంది. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణలో పలుచోట్ల, రాయలసీమలో కొన్ని చోట్ల వర్షాలు కురిసేఅవకాశాలున్నట్లు వాతావారణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్రలోని ఉభయ గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తెలంగాణలోని ఆదిలాబాద్‌, నిజామాబాద్‌. కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *