ఎంతైనా ప్రభువులు కదా.. 2జీ స్కాంలో ప్రధాని, చిదంబరానికి క్లీన్‌చీట్‌


న్యూడిల్లీ  సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి) :
2జీ స్పెక్ట్రామ్‌ కే టాయింపు కేసు లో ప్రధాని మన్మో హన్‌ సింగ్‌, ఆర్థిక మంత్రి పి.చిదం బరానికి సంయుక్త పార్లమెంటరీ సం ఘం (జేపీపీ) క్లీన్‌చీట్‌ ఇచ్చింది. ఈ కుంభకోణంలో మాజీ టెలీకాం మంత్రి ఏ.రాజాను జేపీసీ భాధ్యున్ని చేసినట్లు విశ్వసనీయ వర్గాలు శుక్రవారం తెలిపాయి. 2జీ కేటాయింపులపై జేపీసీ రూపొందించిన నివేదికను మెజారిటీ నోటుతో ఆమోదించినట్లు జేపీసీ చైర్మన్‌ పీసీ చాకో వివరించారు. అయితే ఆది రహస్య నివేదిక అయినందున దీనిలో పాఠ్యాంశాన్ని వెల్లడించనని ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. 2జీ లైసెన్సుల కేటాయింపు వల్ల ప్రభుత్వ ఖజానా కు రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందన్న అప్పటి కాగ్‌ వినోద్‌ రాయ్‌ వేసిన అంచనాను కూడా జేపీసీ తోసిపుచ్చినట్లు తెలిసింది. పార్లమెంటు సమావేశాలు ప్రస్తుతం జరగనందువల్ల లోక్‌సభ స్పీకర్‌ మీరా కుమార్‌కు అక్టోబర్‌ నెలాఖరులో నవేధికను సమర్పించి అనంతరం బహిర్గతం చేస్తామని చాకో తెలిపారు.

తాజావార్తలు