
ప్రధాని మన్మోహన్
న్యూఢిల్లీ : నేరచరితులకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు పై కేంద్రం ప్రతిపాదించిన ఆర్డినెన్స్ విషయంలో ఏఐసీ సీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాల ను కేబినెట్‌లో చర్చిస్తామని ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. ఆర్డినెన్స్ విష యంలో ప్రకటన చేసేముందు రాహుల్ తనకు లేఖ రాశారని ప్రధాని పేర్కొన్నారు. అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఈ అంశంపై కేబినెట్‌లో చర్చిస్తామన్నారు. దోషులైన ప్రజాప్రతినిధులను రక్షించే ఆర్డినెన్స్‌పై ప్రజల్లో విస్తృత చర్చ జరగాలని ప్రధాని ఆశించారు.
యువరాజు తలచుకుంటే.. రాహుల్ అభ్యంతరాలు కేబినెట్‌లో చర్చిస్తాం




