
బాలోసోర్, మార్చి 28 (జనంసాక్షి) :
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పృథ్వి-2 క్షిపణిని ఒడిశాలోని బాలోసోర్‌లో శుక్రవారం ఆర్మీ అధికారులు విజయవంతంగా ప్రయోగించారు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ఆయుధాలు మోసుకుపోగల పృథ్వీ-2 క్షిపణి పరీక్షను 350 కిలోమీటర్ల టెస్ట్ రేంజిలో ప్రయోగించారు. ఈ క్షిపణి 500కేజీల నుంచి 1000 కేజీల బరువున్న ఆయుధాలను మోసుకుపోగలదని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజి అధికారి ఎంవీకేవీ ప్రసాద్ తెలిపారు. క్షిపణి పరీక్ష విజయవంతమైందని, అన్ని లక్ష్యాలను క్షిపణి ఛేదించిందని ఆయన తెలిపారు. డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు క్షిపణి ప్రయోగాన్ని పర్యవేక్షించారు. ఇది ఉపరితంలో శత్రు దేశాల ఆయుధాలను తుత్తినియలు చేయగలదన్నారు.
పృథ్వీ-2 విజయవంతం




