Monday, 2 November 2026

20 నుంచి అసెంబ్లీ

Untitled-5
ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 2 (జనంసాక్షి) : ఈ నెల 20 నుంచి తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేకు శిక్షణా తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. దీపావళి పండగ దృష్ట్యా మధ్యలో 3 రోజులపాటు సమావేశాలకు విరామం ఉంటుంది. ఇప్పటికే బడ్జెట్‌ రూపకల్పనపై సర్కార్‌ కసరత్తు చేసింది. గతంలో కన్నా భిన్నంగా సమావేవాలను నిర్వహించనున్నారు. అలాగే బడ్జెట్‌ కేటాయింపులు కూడా ప్రాథామ్యాలను బట్టి ఉండబోతున్నాయి. ఇదిలావుంటే వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే సమావేవౄలు జరపాలని డిమాండ్‌ కూడా చేస్తున్నాయి. మరోవైపు పార్లమెంటు, శాసనసభల్లో 33శాతం చొప్పున సీట్లను పెంచి వాటిని, ఆ మేరకు మహిళలకు కేటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోదీని కోరారు. దీనిపై  ఆయన లేఖ రాశారు. వెనకబడిన తరగతుల (బీసీ) వారికి చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లను అమలుచేయాలని విన్నవించారు. తద్వారా మహిళలు, బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుందని, విధాన నిర్ణయాల్లో వారికి భాగస్వామ్యం దక్కుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను వెంటనే ఏర్పాటుచేయాలన్నారు. తెలంగాణ ఆవిర్భవించాక కొత్త రాష్ట్రంలో శాసనసభ, మండలిల ద్వారా ఈ మూడు అంశాలపై ఏకగ్రీవ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపామని తెలిపారు. చెరువుల పునరుద్ధరణతెలంగాణలో చెరువుల పునరుద్ధరణను ప్రణాళికబద్ధంగా నిర్వహిస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. నల్గొండ జిల్లా నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, మూసంపల్లి చెరువు పనుల్లో పాల్గొంటానని తెలిపారు. అదే జిల్లాకు చెందిన రైతు బోర్ల రాంరెడ్డి సీఎంను సచివాలయంలో కలిసి చెరువుల పునరుద్ధరణ కోసం పలు ప్రతిపాదనలు చేశారు. వీటిపై సీఎం స్పందించారు. నల్గొండ కలెక్టర్‌ చిరంజీవులు, నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడారు. జిల్లాలో ప్లోరైడ్‌ సమస్యను రూపుమాపడంతోపాటు అన్ని ప్రాంతాల్లో రక్షిత నీటిని అందించేందుకు తెలంగాణలో గ్రిడ్‌ను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 11న ఎల్బీస్టేడియంలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ జరుగుతుందని, 12న పరేడ్‌ గ్రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ జరుగుతుందని చెప్పారు. 20 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని కేసీఆర్‌ తెలిపారు. త్వరలోనే ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. నాలుగేళ్లలో తెలంగాణలోని ప్రతి ఇంటికీ మంచినీటి నల్లా ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టంచేశారు. చెరువుల పూడికతీత, హరితవనాన్ని ఉద్యమంలా చేపట్టాలని కేసీఆర్‌ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు సూచించారు. హరితవనంపై 500 బృందాలతో పల్లెల్లో ప్రచారం చేయించనున్నట్లు ఆయన చెప్పారు. ప్రపంచ దేశాలు తెలంగాణవైపు చూసేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు. పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని కేసీఆర్‌ స్పష్టంచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *