Monday, 2 November 2026

పవార్‌ పథకం ప్రకారమే పొత్తు విచ్ఛిన్నం

Untitled-6
రాజ్‌ఠాక్రే

ఔరంగాబాద్‌, అక్టోబర్‌ 2 (జనంసాక్షి) : శరద్‌పవార్‌ పథకం ప్రకారమే బీజేపీ, శివసేన పొత్తు విచ్ఛిన్నమైందని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్‌) అధినేత రాజ్‌ ఠాక్రే ఆరోపించారు. ముంబైలో బుధవారం రాత్రి జరిగిన పార్టీ మద్దతుదార్ల సమావేశంలో రాజ్‌ ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీల మధ్య పాతికేళ్లుగా ఉన్న పొత్తు విచ్ఛిన్నం కావడానికి ఎన్సీపీ అధినేత పవార్‌ కారణమని అన్నారు. పొత్తుకు స్వస్తి చెబితే బీజేపీకి ఎన్సీపీ మద్దతు ఇస్తుందంటూ పవార్‌ హావిూ ఇవ్వడంవల్లనే బీజేపీ, శివసేన మధ్య పొత్తు విచ్ఛిన్నమైందని రాజ్‌ అన్నారు. రాష్ట్రంలో రెండు గ్రూపుల పొత్తులు దెబ్బతినడానికి, రాజకీయ గందరగోళానికి కాంగ్రెస్‌, ఎన్సీపీ, బీజేపీ, శివసేన పార్టీల వైఖరే కారణమని విమర్శించారు. దశాబ్దాలుగా ఉన్న పొత్తు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో విచ్ఛిన్నమైన సంగతి తెలిసందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీలు తమ ప్రత్యర్థి పార్టీలపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టాయి. ఎంతో కాలంగా ఉన్న పొత్తుల విచ్ఛిన్నం అనంతరం ఎన్నిలకు ఆయా పార్టీలు వెళ్తున్నాయి. దీంతో మహారాష్ట్ర ఎన్నికలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. దేశం దృష్టిని ఆకట్టుకునేలా ఆ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రాజ్‌ఠాక్రే ఆరోపణలతో పొత్తుల విషయంలో వచ్చిన విభేదాలు మరింత బహిర్గతం అయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *