Wednesday, 4 November 2026

August 2012

వార్తలు

మాజీ కేంద్రమంత్రి అన్బుమణి రాందాస్‌కు బెయిల్‌

ఢిల్లీ: వైద్య కళాశాల సీట్ల కేటాయింపు అక్రమాల కేసులో అరెస్ట్‌ అయి జైల్లో ఉన్న మాజీ ఆరోగ్యశాఖ కేంద్రమంత్రి అన్బురాందాన్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

జిల్లా వార్తలు

వడ్డేపల్లి మండలంలో అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసం

కొంకల: వడ్డేపల్లి మండలం కొంకల గ్రామంలో గుర్తు తెలియని దుండగులు శనావారం తెల్లవారుజామున అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.ఈ సంఘటనను ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖడించారు.

హైదరాబాద్

భర్త ఇంటి ముందు భార్య ధర్నా

హైదరాబాద్‌: తనకు న్యాయం కావాలంటూ ఒక ప్రవాస భారతీయ మహిళ రెండేళ్ల కొడుకుతో హైదరాబాద్‌ గాంధీనగర్‌లో భర్త ఇంటి ముందు  ధర్నాకు దిగింది. చెన్నైకి చెందిన యామిని ఆస్ట్రేలియాలో డాక్టర్‌గా పనిచేస్తోంది. 2009లో ఆమెకు  హైదరాబాద్‌కు చెందిన కార్తీక్‌తో…

హైదరాబాద్

రాష్ట్రంలో డిజిటల్‌ సంతకాల చెల్లుబాటుకు వీలు కల్పిస్తూ జీవో జారిచేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌: రాష్ట్రంలో వివిధ ఆర్థిక లావాదేవీలా రశీదుల, ధ్రువపత్రాలకు ఎలాక్ట్రానిక్‌ పద్దతిలో డిజిటల్‌ సంతకాల చెల్లుబాటుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి వి.భాస్కర్‌ ఈ మేరకు ఇచ్చిన జీవోలో…

కరీంనగర్

వివాహిత ఆత్మహత్య

కోహెడ: మండంలోని కూరెల్ల గ్రామానికి చెందిన వివాహిత గుడి హేమలత (23) ఆత్మహత్య చేసుకుంది. అత్తవారింట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగింది. భర్త కరుణాకర్‌ రెడ్డి. అత్తమామలు వసంత, గోపాల్‌ రెడ్డి అదనపు కట్నం కోసం…

హైదరాబాద్

భర్తలను వేధిస్తున్నారంటూ భార్యల ధర్నా

హైదరాబాద్‌:  కొండాపూర్‌ 8వ బెటాలియన్‌లో కమాండెంట్‌ వేధింపులకు నిరసనగా మహిళలు ఆందోళనకు దిగారు. సెలవులు మంజూరు చేయకుండా తమ భర్తలను ఆయన వేధిస్తున్నాడని పేర్కొంటూ భార్యలు ఈ ఆందోళన చేపట్టారు.

హైదరాబాద్

గ్రూప్‌-4 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: పూనం మాలకొండయ్య

హైదరాబాద్‌: ఈ నెల 11న నిర్వహించే గ్రూప్‌-4 పరీక్షకు ఏర్పాట్లు పూర్తియినట్లు ఏపీపీఎస్‌సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. ఈ పరీక్షకు 9,58,333 మంది హాజరవుతున్నట్లు ఆమె తెలియజేశారు. పరీక్ష నిర్వహణకు 2,629 కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఒక…

కరీంనగర్

తల్లి పాలపై అవగాహన కార్యక్రమం

హుస్నాబాద్‌: మండలంలోని అంతకపైట గ్రామంలో ఈరోజు అంగన్‌ వాడి కేంద్రం అధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సంధర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతను గర్భిని, బాలింత మహిళలకు వివరించారు. శిశువులు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిపాలు తప్పనిసరని వారు తెలియజేశారు. ఈ…

జిల్లా వార్తలు

బాలానగర్‌ లో చిన్నారికి అమ్మ కోసం అన్వేషణ

బాలా నగర్‌: జిల్లా కేంద్రం లోని సాయిశ్ర్రీ ఆసుపత్రిలో ఇటీవల విక్రయానికి పెట్టిన చిన్నారికి సంబంధించిన వివరాల కోసం క్రైం బ్రాంచ్‌ పోలీసులు అన్వేషణ చేస్తున్నారు. శుక్రవారం బాలనగర్‌ మండలంలోని వివిధ గ్రామాల్లోని అంగన్‌వాడీ కార్యకర్తలతో క్రైం బ్రాంచ్‌…

హైదరాబాద్

పిల్లల విషయంలో స్త్రీ అభిప్రాయానికి భర్త, కుటుంబ సభ్యులు ప్రాధాన్యమివ్వాలి:అమల

హైదరాబాద్‌: సినినటి, బ్లూక్రాన్‌ సోసైటీ అధ్యక్షురాలు అమల మాదాపుర్‌లోని రెయిన్‌బో ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ల్యాక్టేషన్‌ సెంటర్‌ను శనివారం అమల ప్రారంభించారు. పిల్లల్ని కనే విషయంలో స్త్రీ అభిప్రాయానికి భర్త, కుటురంబ సభ్యులు ప్రాధాన్యమివ్వాలని అన్నారు.  మహిళలకు…