Thursday, 5 November 2026

September 2012

జిల్లా వార్తలు

ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి

మద్దూరు:మండలంలోని కొండాపూర్‌ గ్రామానికి చెందిన పేరాల కౌసల్య(75) అనే వృద్ధురాలు ఇంటి సమీపంలోని బావిలో ప్రమాదవశాత్తూ కాలుజారి బావిలోపడి మృతిచెందినది.

వార్తలు

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

కండె: టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా  గ్రూప్‌-డిలో న్యూజిలాండ్‌,బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

హైదరాబాద్

పరిశ్రమలకు విద్యుత్‌ కోతలపై హైకోర్ట్‌లో పిటిషన్‌

హైదరాబాద్‌: పరిశ్రమలకు విద్యుత్‌ వాడకాన్ని పరిమితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీసీపీడీసీఎల్‌ను ఆదేశించింది.

జిల్లా వార్తలు

ఎడ్లబండిని డీకోన్న లారీ స్తంబించిన రాకపోకలు

  పరిగి ఎడ్లబండిని లారీ ఢీకోనడంతో పరిగి, మహబూబ్‌నగర్‌ మార్గంలో గంటకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సంఘటన పరిగి పోలిస్‌స్టేషన్‌ పరిధిలోని మల్కాపూర్‌, రాఘవపూర్‌ గ్రామాల మధ్య శుక్రవారం జరిగింది. దీంతో ఒక కాడెద్దు అక్కడికక్కడే చనిపోగా…

జాతీయం

తెలంగాణ పై కచ్చితమైన అభిప్రాయం చెబుతాం: దేవేందర్‌ గౌడ్‌

ఢిల్లీ: కేంద్రం తెలంగాణ సమస్య పరిష్కారానికి చర్యలు ,చేపడితే తమ పార్టీ తరపున కచ్చితమైన అభిప్రాయం చెబుతామని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు దేవేందర్‌గౌడ్‌ అన్నారు. పార్టీలోని అన్ని ప్రాంతాల వారిని సంప్రదించి ఓ అభిప్రాయానికి వస్తామని తెలియజేశారు.

హైదరాబాద్

శాసనసభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌: విపక్షాల ఆందోళనల మధ్య శాసనసభ రేపటికి వాయిదా పడింది. శాసనసభ రెండు సార్లు వాయిదా పడినప్పటికీ సభ సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించలేదు. తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టాలని టీఆర్‌ఎస్‌ సభ్యులు స్పీకర్‌ పోడియంను చుట్టు నిరసన వ్యక్తం…

ఆదిలాబాద్

గణపతికి కుంకుమార్చనలు

  కాగజ్‌నగర్‌ స్థానిక అర్యవైశ్య సంఘం అధ్వర్యంలో శుక్రవారం కన్యకాపరమేశ్వర అలయంలో వినాయకుడి ప్రతిమ వద్ద ఘనంగా కుంకుమార్చనలు నిర్వహించారు. పూజారివామన శర్మ అధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులుఅధిక సంఖ్యలో హజరయ్యారు.

ఆదిలాబాద్

ఈఎస్‌ఐ అస్పత్రిలో రోగులకు పండ్లు పంపీణీ

  కాగజ్‌నగర్‌ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు జన్మదినం సందర్బంగా అయన వర్గీయులు పట్టణంలోని ఈఎన్‌ఐ అస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్‌ గణపతి ఎస్పీఎం గుర్తింపు కార్మక సంఘం నాయకులు, కార్మికులు పాల్గోన్నారు.

జాతీయం

యూపీఏకు మద్దతు కొనసాగిస్తాం: ములాయంసింగ్‌

న్యూఢిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతును కోల్పోయిన యూపీఏ-2 ప్రభుత్వానికి వూరట లభించిందింది. మన్మోహన్‌ సర్మారుకు మద్దతు  కొనసాగిస్తామని సమాజ్‌వాదీ పార్టీ ఈ రోజు ప్రకటించింది. యూపీఏ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు కొనసాగుతుందని ఆ పార్టీ అధినేత ములాయంసింగ్‌…

కరీంనగర్

గ్రానైట్‌ లారీలను అడ్డుకున్న గ్రామస్థులు

  గంగాధర అధిక బరువుతో గ్రానైట్‌ రవాణా చేస్తున్న లారీల వల్ల గంగాధర – బూరుగుపల్లి ప్రధాన రహదారి పూర్తిగా శిథిలమైందని అందోళన చెందుతూ శుక్రవారం గంగాధర గ్రామస్థులు గ్రానైట్‌ లారీలను అడ్డుకున్నారు. గ్రానైట్‌ లారీల వల్ల రోడ్డు…