Thursday, 5 November 2026

October 2012

జిల్లా వార్తలు

తహశీల్దార్‌ కార్యలయానికి తాళం

మల్దికల్‌: మండలంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు తహశీల్దార్‌ కార్యలయం ముందు ధర్నా చేశారు. కళాశాలో మౌలిక వసతుల లేనందున అధికారులు హామి నెరవేర్చనందుకు నిరసనగా విద్యార్థులు తహశీల్దార్‌ కార్యలయానికి తాళం వేసి దిగ్భందించారు. దాదాపు రెండు గంటలు…

జిల్లా వార్తలు

ఎక్సైజ్‌శాఖ తనిఖీలు

కొడంగల్‌: ఎక్సైజ్‌శాఖ అధికారులు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. బొంరాన్‌పేట మండలం సుంకిమెట్ల గ్రామ స్టేజి వద్ద ఓ కిరాణా దుకాణంలో 13కేజీల ఆల్ఫోజోలమ్‌(మత్తుమందు)ను ఉదయం ఎక్సైజ్‌ సీఐ శ్యాంసుందర్‌ పట్టుకున్నారు.

ఆదిలాబాద్

తలమడుగు ద్విచక్రవాహనం బోల్తాపడి వ్యక్తి మృతి

తలమడుగు: ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడి వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన మంగళవారం రాత్రి తలమడుగు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని బరంపుర్‌ గ్రామానికి చెందిన మారం భీమన్న (35) వ్యవసాయ పనుల నిమిత్తం పల్లి(కె) గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా…

ఆదిలాబాద్

తాంసి మండలంలో పశువైద్య శిభిరం

తాంసి: మండల కేంద్రంలో రాజీవ్‌ వికాస్‌ కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు పశువైద్య శిబిరాన్ని పశుసంవర్ధకశాఖ జేడీఏ విఠల్‌రావు ప్రారంభించారు. ఈ ఏడాది పశుక్రాంతి పధకంలో 3000 పశువులను అందజేస్తామన్నారు.

ఆదిలాబాద్

చంద్రబాబు పాదయాత్రకు మద్దతుగా బైక్‌ర్యాలీ

ఇంద్రవెళ్లి: ఖానాపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు ఈ రోజు బైక్‌ ర్యాలీ చేపట్టారు. చంద్రబాబు పాదయాత్రకు మద్దతుగా మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకు ద్విచక్రవాహనాల ర్యాలీ చేపట్టారు.

కరీంనగర్

ఐటీఐలో అదనపు జేసీ విచారణ

పెద్దపల్లి: 2010-11 విద్యా సంవత్సరంలో బోగన్‌ కంపెనీల్లో శిక్షణ పొందినట్లు 250మంది అభ్యర్థులపై లోకాయుక్తలో చేసిన ఫిర్యాదు మేరకు ఈ రోజు అదనపు జేసీ  సుందర్‌ అబ్నార్‌ విచారణ నిర్వహించారు. వరంగల్‌ ఆర్‌డీడీ పెద్దపల్లి ఐటీఐ ప్రిన్సిపాల్‌లు కుమ్మక్కై…

కరీంనగర్

అంతర్జాతీయ వికలాంగుల ఆరోగ్య దినోత్సవం

పెద్దపల్లి: అంతర్జాతీయ వికలాంగుల ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు స్థానిక స్పూర్తి మానసిక వికలాంగుల పాఠశాలలో పెద్దపల్లి మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ శ్రీ లేఖ పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

హైదరాబాద్

ఆచార్య బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు పూర్తి : తీర్పు వాయిదా

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో బీపీ ఆచార్య బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ న్యాయస్థానంలో వాదనలు పూర్తయ్యాయి. అయితే ఈ పిటిషన్‌పై తీర్పును సీబీఐ న్యాయస్థానం ఈ నెల 16కు వాయిదా వేసింది.

వార్తలు

త్వరలో మరిన్ని మెడిరల్‌ కళాశాలలు

మట్టెవాడ: వరంగల్‌ ప్రాంతంలోని లాల్‌బహదూర్‌ కళాశాలలో బుధవారం ఉదయం కళాశాల నూతన మహిళా వసతి గృహం ఇండోర్‌ స్టేడియం ప్రారంభోత్సరం, శంకుస్థాపన జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు జానారెడ్డి, సారయ్య, ఛీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్‌…

జాతీయం

కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలుచేసిన తమిళనాడు

ఢిల్లీ: కావేరీజలాల వివాదంపై తమిళనాడు ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది. రాష్ట్రానికి విడుదల చేయాల్సిన కావేరీ జలాలను మధ్యలోనే ఆపేసినందుకు తమిళనాడు ఈ పిటిషన్‌ దాఖలుచేసింది.