Saturday, 7 November 2026

November 2012

జిల్లా వార్తలు

మంజీర పైపులైను విస్తరణ పనులు ప్రారంభం

షాపుర్‌నగర్‌ : గాజుల రామారం గ్రామంలో రూ. 2.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మంజీర పైపులను విస్తరణ పనులను కుత్బుల్లాపూర్‌ శాసనసభ్యుడు కూన శ్రీశైలంగౌడ్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గోన్నారు.

హైదరాబాద్

చార్మినార్‌ పరిసరాల్లో పరిస్థితి ఉద్రిక్తం

హైదరాబాద్‌: చార్మినార్‌ పరిసరాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో భాష్పవాయువు ప్రయోగించారు.

హైదరాబాద్

సర్‌ఛార్జీలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్‌: వినియోగదారులపై విద్యుత్‌ ఇంధన సర్‌ఛార్జీలు అక్రమమంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణ పూర్తయ్యేవరకూ సర్‌ఛార్జీ వసూలు చేయరాదని డిస్కంలకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టుకు వచ్చిన పటిషనర్ల నుంచి సర్‌ఛార్జీలు…

హైదరాబాద్

గ్రేటర్‌ టీడీపీ అధ్యక్షుడిగా తలసాని

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ టీడీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నియమితులయ్యారు. ఈమేరకు ఆపార్టీ  కార్యాలయం నుంచి ఆయనకు నియామకపు ఉత్తర్వులు అందాయి.

హైదరాబాద్

టీఆర్‌ఎస్‌ భవన్‌కు బయలుదేరిన స్వామిగౌడ్‌

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌లో చేరనున్న తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ అధికారుల సంఘం మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్‌ బంజారాహిల్స్‌లోని టీఆర్‌ఎస్‌ భవన్‌కు బయలు దేరారు. ఇవాళ ఆయన టీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. రాజేంద్రనగర్‌ మండలం కిస్మత్‌పురలో టీఆర్‌ఎస్‌…

కరీంనగర్

ఎంఐఎం మద్దతు లేకున్న ఇబ్బంది లేదు: ఆరేపల్లి మోహన్‌

హుస్నాబాద్‌: రాష్ట్ర చరిత్రలో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్‌కు నైతికంగా తప్పా నేరుగా ఏనాడు ఓటువేసి మద్దతు తెలపలేదని ప్రభుత్వ విప్‌ ఆరేపల్లి మోహన్‌ అన్నారు, కాంగ్రెస్‌కు మజ్లీన్‌ మద్దతు ఉపసంహరించుకున్నంత మాత్రన ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని కరీంనగర్‌…

హైదరాబాద్

నాంపల్లి కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన జగన్‌

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న వైకాపా అధ్యక్షుడు జగన్‌ తరపున ఆయన ప్రతినిధులు నాంపల్లి సీబీఐ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాకలు చేశారు.

వార్తలు

ప్రారంభమైన టీటీడీ పాలకమండలి సమావేశం

తిరుపతి : టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. ఇక్కడి అన్నమయ్య భవన్‌లో పాలక మండలి సభ్యులతో ఛైర్మన్‌ భేటీ అయ్యారు. టీటీడీ పరిధిలోని పలు సమస్యలపై వారు చర్చించనున్నారు. ఈ సమావేశంలోనే నూతన సంవత్సర డైరీలను టీటీడీ…

జిల్లా వార్తలు

గుడిసె దగ్దం

దౌత్తాబాద్‌ : ఇందుప్రియాల గ్రామంలో సమ్మల అంజయ్యకు చెందిన నివాస గుడిసె దగ్దమైనట్లు బాదితుడు స్థానిక పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంబించాడు.

జిల్లా వార్తలు

కొనసాగుతున్న మావోయిస్టుల బంద్‌

వరంగల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానలకు వ్యతిరేకంగా మావోయిస్టులు పిలుపునిచ్చిన 48 గంటల ఉత్తర తెలంగాణ బంద్‌ రెండో రోజు కొనసాగతోంది. బంద్‌ను విపలం చేసేందుకు పోలీసు యంత్రాంగం బందోబస్తు చర్యలు చేపట్టింది. నిన్న, ఇవాళ ఏజెన్సీ ప్రాంతాల్లో…