Wednesday, 4 November 2026

November 2012

ఖమ్మం

కరకగూడేంలో ఇద్దరు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నా పోలీసులు

ఖమ్మం: జిల్లాలోని చినపాక మండలం కరగూడేంలో ఇద్దరు మావోయిస్టులను స్పెషల్‌ పార్టీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ నిమ్మిత్తం కొత్తగూడెం ఓఎస్టీ వద్దకు తరలిస్తున్నట్లు సమాచారం, అదుపులో ఉన్న మావోయిస్టు సభ్యులను వెంటనే కోర్టులో హాజరుపరచాలని హక్కుల…

తెలంగాణ

సీఎం ఏరియల్‌ సర్వే అలస్యం

హైదరాబాద్‌: ముంపు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వూకు వెళ్లనున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన అలస్యంగా ప్రారంభం కానుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆయన వేచి ఉన్నారు.

వార్తలు

నేడు అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌

వాపింగ్టన్‌: ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నిక సంబంధించి పోలింగ్‌ ఇవాళ జరగనుంది, అధ్యక్షస్థానానికి ప్రస్తుత అధ్యక్షడు బరాక్‌ ఒబమా, మిట్‌రోమ్ని తలపడుతున్నారు. వీరి మధ్య హోరాహోరీ పోటీ జరుగుతోంది.

వార్తలు

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 10 పాయింట్లకుపైగా నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 4 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

వార్తలు

లక్ష హెక్టర్లలో దెబ్బతిన్న పంటలు

కృష్ణా: నీలం తుపాను ప్రభావంతో జిల్లాలో 1,06,169 హెక్టార్లలో వరి,పత్తి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి, భారీ వర్షాల కారణంగా జిల్లా రహదారులకు రూ.132 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. వరద ఉద్థృతి తగ్గకపోవడంతో విజయవాడలో…

సీమాంధ్ర

పంట నష్టం వివరాలు సేకరిస్తున్న అధికారులు

విజయనగరం: జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టామి, దీంతో సహాయక చర్యలను అధికారులు వేగవంతం చేశారు. పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతు పనులు చేపట్టారు. మరోవైపు క్షేత్రస్థాయిలో పంట నష్టం వివరాలను రెవెన్యూ, వ్యవసాయ అధికారులు సేకరిస్తున్నారు.

జాతీయం

మద్దతుదారులతో నేడు యడ్యూరప్ప భేటీ

బెంగళూరు: భాజపాను వీడి కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు వెల్లడించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నేడు తన మద్దతుదారులతో భేటీ అవుతున్నారు. బెంగళూరులోని డాలర్‌ కాలనీ నివాసంలో విందు భేటీకి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయన ఆహ్వానం పంపారు.…

సీమాంధ్ర

విశాఖ నుంచి గరీబ్‌రథ్‌, దురంతో ఎక్స్‌ప్రెస్‌ యథాతథం

విశాఖ: విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లాల్సిన గరీభ్‌రథ్‌, దురంతో ఎక్స్‌ప్రెస్‌లు ఈ రోజు యధావిధిగా నడుస్తాయని తూర్పు కోస్తా రైల్వే వాల్తేరు డివిజన్‌ అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా ఈ రైళ్లు రద్దు చేస్తున్నట్లు నిన్న ప్రకటించారు.…

తెలంగాణ

ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ నుంచి గుంటూరుకు  వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ డీ1 బోగీలోని పలు ఫ్యాన్ల నుంచి స్వల్పంగా మంటలు, పొగలు భయాందోళనకు గురైన ప్రయాణికులు చెయిన్‌ లాగి రైలును ఆపివేశారు. చర్లపల్లి సమీపంలో రైలును నిలిపి 25 నిమిషాలపాటు…

సీమాంధ్ర

వరద బాధిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటించాలి: కిషన్‌రెడ్డి

రాజమండ్రి: వరద బాధిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కోరారు. నీలం తుపానుతో జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వమే అంచనా వేయాలని డిమాండ్‌ చేశారు. భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించేందుకు తూర్పుగోదావరి…