Sunday, 8 November 2026

November 2012

వార్తలు

గడ్చిరోలిని సందర్శించిన సీఆర్పీఎఫ్‌ చీఫ్‌

నాగ్‌పూర్‌:సీఆర్పీఎఫ్‌ డైరక్టర్‌ జనరల్‌ ప్రణయ్‌ సహాయ్‌ మహారాష్ట్రలోని నక్సల్‌ ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలిని సందర్శించారు. ఆయన గడ్చిరోలికి 40 కిలోమీటర్ల దూరంలోని పెంద్రీ ఔట్‌పోస్టును సందర్శంచారు. ఆయన పర్యటన వివరాలను చివరి వరకు గోప్యంగా ఉంచారు. గత మార్చిలో…

వార్తలు

కూలిన మిగ్‌-21

గుజరాత్‌ : గుజరాత్‌ రాష్ట్రంలోని నాలియాలో మిగ్‌-21 విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటన నుంచి ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు.

జాతీయం

ప్రభుత్వ రాయితీలు నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకి చిదంబరం

న్యూఢిల్లీ: ప్రభుత్వం అందించే రాయితీలను నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకే నగదు రూపంలో బదిలీ చేస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి పి. చిదంబరం అన్నారు. జనవరి 1నుంచి 15 రాష్ట్రాల్లో పింఛను, రాయితీల సొమ్ము ఈ విధంగా జమచేస్తామన్నారు. దేశవ్యాప్తంగా…

హైదరాబాద్

రాజ్యాంగబద్థ సంస్థలను కాంగ్రెస్‌ చులకన చేస్తోంది: వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ, యూపీఏ తీరుపై భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ ప్రజల్ని పక్కదారి పట్టిస్తూ.. రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ కాంగ్రెస్‌ చులకన చేస్తోందని ఆయన విమర్శించారు. దేశంలో అత్యున్నత రాజ్యాంగబద్ధ సంస్థలైన న్యాయవ్యవస్థతోపాటు విజిలెన్స్‌,…

హైదరాబాద్

వ్యవసాయ సదస్సు విజయవంతమయ్యేందుకు కృష్టి : ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: వచ్చే సంవత్సరం హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రపంచ వ్యవసాయ సదస్సు విజయవంతం అయ్యేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలియజేశారు. జూబ్లీహాల్లో రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న  మార్పులు,…

వార్తలు

పాక్‌లో వూరేగింపులో బాంబు పేలుడు : ముగ్గురి మృతి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో షియా ముస్లిం వరం వూరేగింపులో బాంబు పేలుడు  చోటుచేసుకుంది. ఈఘటనలో ముగ్గురు మృతి చెందగా .. 17 మంది గాయపడ్డారు. ఖైబర్‌-పక్తుంఖ్వా ప్రాంతంలోని డిఖన్‌ టోపన్‌వాల్‌లో మొహర్రం సందర్భంగా ముస్లింలు వూరేగింపు చేపట్టారు. ఈ మార్గంలో…

జాతీయం

సామాన్యుల అభ్యున్నతే లక్ష్యంగా రాజకీయ పార్టీ : కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ తాను త్వరలో ప్రారంభించపోయే పార్టీ పేరును నేడు ప్రకటించనున్నారు. సామాన్య ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పార్టీ ఆవిర్భావం ఉంటుందని ఆయన ఢిల్లీలో తెలియజేశారు. దేశవ్యాప్తంగా 350 మంది సభ్యులతో జాతీయ కార్యవర్గం…

కరీంనగర్

భద్రతా ప్రమాణాల లోపంతోనే రోడ్డు ప్రమాదాలు

రాజీవ్‌ రహదారి విస్తరణ పనులను పరిశీలించిన సభాసంఘం కరీంనగర్‌: రాజీవ్‌ రహదారి విస్తరణ పనుల పరిశీలన కొనసాగుతోంది. రెండో రోజు సభాసంఘం కరీంనగర్‌ జిల్లా ముగ్దుం వద్ద రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించింది. పరిశీలనలో నాణ్యతా లోపాలు, మలుపుల…

జాతీయం

సోనియాతో ముగిసిన డీఎస్‌ భేటీ

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఆ పార్టీ ఏపీ మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.

హైదరాబాద్

ప్రయాణికుల నుంచి అభివృద్ధి రుసుం: ఖాన్‌

హైదరాబాద్‌: ప్రయాణికుల నుంచి అభివృద్ధి రుసుం వసూలు చేయాలనే ప్రతిపాదన వాస్తవమే అని ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్‌ తెలియజేశారు. దీన్ని ఎప్పుటి నుంచి, ఎంతమేర వసూలు చేయాలన్న విషయాన్ని ఆలోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలోని పలు ఆర్టీసీ…