Wednesday, 4 November 2026

December 2012

వార్తలు

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

కోల్‌కతా : ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ మొదటి వికెట్‌ను కోల్పోయింది. సెహ్వగ్‌ 23 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. 10 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 1 వికెట్‌ నష్టానికి 48 పరుగులు చేసింది.…

జాతీయం

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 40 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 17 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.

Featured News

నార్వేలో ‘ఆంధ్రా’ దంపతులకు జైలు శిక్ష

ఓస్లో, డిసెంబర్‌ 4 (జనంసాక్షి): చిన్నారిని మందలించిన కేసులో తెలుగు దంపతులు చంద్రశేఖర్‌, అనుపమలకు ఓస్లో న్యాయస్థానం మంగళవారంనాడు శిక్ష ఖరారు చేసింది. చంద్రశేఖర్‌కు 18నెలలు, తల్లి అనుమపకు 15నెలలపాటు జైలు శిక్షను విధించింది. చంద్రశేఖర్‌ దంపతులు తమ…

Featured News

టీఎంపీలధిక్కారస్వరం

జైపాల్‌తో సహా ఎంపీలు డుమ్మా కాంగ్రెస్‌ హై కమాండ్‌ పరేషాన్‌ మంత్రులతో చర్చలకు నో స్వాగతించిన కోదండరామ్‌.. న్యూఢిల్లీ, నవంబర్‌ 4 (జనంసాక్షి): తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు హైకమాండ్‌కు షాకిచ్చారు. ఇంతకాలం సానుకూల ధోరణితో ఉన్న ఎనిమిది…

వార్తలు

ఉపాధ్యాయుల దండనతో విద్యార్ధి మృతి

భోపాల్‌: ఉపాధ్యాయులు విచక్షణ రహితంగా దండించిన ఘటనలో 9 ఏళ్ల విద్యార్ధి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బేతుల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న  విద్యార్ధిని ఇద్దరు ఉపాధ్యాయులు…

వార్తలు

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌

కోల్‌కతా : ఇంగ్లండ్‌తో కోల్‌కతాలో జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. జట్టులో హర్భజన్‌ స్థానంలో ఇషాంత్‌శర్మకు అవకాశం కల్పించారు. రెండో టెస్టులో ఘోర పరాజయంపాలైన టీం ఇండియా ఈ టెస్టులో ఎలాగైనా నెగ్గాలని…

హైదరాబాద్

నేడు సీబీఐ కోర్టుకు జగన్మోహన్‌రెడ్డి?

హైదరాబాద్‌:అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్‌, మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందరెడ్డిలను జైలు అధికారులు గగన్‌విహార్‌లోని సీబీఐ కోర్టుకు బుధవారం తీసుకొచ్చే అవకాశాలున్నాయి. వీరి రిమాండ్‌ గడువు బుధవారంతో ముగుస్తున్న నేపథ్యంలో రిమాండ్‌ పోడగింపు…

జాతీయం

లోక్‌సభలో నేడు ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌

న్యూఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశంపై నేడు లోక్‌సభలో ఓటింగ్‌ జరగనుంది, తమకు సరైన సంఖ్యాబలం ఉందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తున్నా… యూపీఏకు మద్దతిచ్చే అంశంపై ఎస్సీ, బీఎస్సీ పక్షాలు ఇంకా స్పష్టతపివకవ్వలేదు. ఎస్సీ…

ఖమ్మం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ఖమ్మం: దుమ్ముగూడెం మండలం తురుబాక వంతెనపై ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢికొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.