
1,122 మంది ఎంపిక
ఇరు రాష్ట్రాలకు 24 మంది సెలక్ట్
న్యూఢిల్లీ, జూన్ 12 (జనంసాక్షి) :సివిల్ సర్వీసెస్-2013 పరీక్షల ఫలి తాలు వెల్లడయ్యాయి. 1,122 మంది పరీక్షల్లో అర్హత సాధించినట్లు యూపీఎస్సీ ఒక ప్రకటనలో పేర్కొంది. డిసెంబర్-2013లో నిర్వహించిన ప్రధాన పరీక్ష, ఏప్రిల్-జూన్ 2014లో నిర్వహించిన ఇంటర్వ్యూల ఆధారంగా ఫలితాలను విడుదల చేసినట్టు పేర్కొంది. ఐఏఎస్, ఐపీఎస్, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ, బీ స్థాయి ఉద్యోగాల నియమాకాలు ఈ పరీక్షల ఆధారంగా చేపడుతారు. వీరిలో 24 మందిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయిస్తారు. సివిల్స్‌లో ర్యాంకులు సాధించిన ఇరు రాష్ట్రాలకు చెందిన వారు.. క్రితిక జ్యోత్స్న- 30వ ర్యాంకు, కృష్ణ ఆదిత్య -99వ ర్యాంకు,
సాయి చరణ్ – 124, రవళిప్రియ గంధపునేని – 161, పీయూష్ సమారియా-165, సింధుశర్మ – 213, పి. గౌతమ్ – 318, పార్థసారథి భాస్కర్ – 395, కొమ్మిశెట్టి మురళీధర్ – 406, చెరుకూరి కీర్తి – 440, పి. మాధురి – 817, ఎన్. అనిల్‌కుమార్ – 885.
2013 సివిల్స్ ఫలితాలు వెల్లడి




