హైదరాబాద్, జూన్ 12 (జనంసాక్షి) :తెలంగాణ శాసనసభ ఉపసభాపతిగా మెద క్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విపక్షాలు కూడా మద్ద తు తెలపడంతో పద్మాదేవేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రక టించారు. గురువారం సభ ప్రారంభం కాగానే డెప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహిం చారు. కేవలం పద్మాదేవేందర్‌రెడ్డి ఒక్కరే నామినేషన్ వేయడం, విపక్షాలు ఆమెకు మద్ద తు తెలపడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి కేసీఆర్, విపక్ష నేతలు జానారెడ్డి, గీతారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, డాక్టర్ లక్ష్మణ్, మంత్రులు తదితరులు ఆమెను సాదరంగా సభాధ్యక్ష స్థానానికి తీసుకెళ్లారు. అనంతరం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తూ.. ఉపసభాపతిగా ఎన్నికైన పద్మపై ప్రశంసలు కురిపించారు. ఆమెతో తన కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.బిడ్డ అని సంబోధించే వారిలో పద్మాదేవేం దర్‌రెడ్డి ఒకరని.. తన బిడ్డ ఉన్నత స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు. వివి ధ ¬దాల్లో ఆమె విశేషంగా రాణించారని చెప్పారు. జడ్పీటీసీ సభ్యురాలిగా, ఎమ్మెల్యే గా, పార్టీ మహిళా అధ్యక్షురాలిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించారని ఉపస భాపతిగా కూడా ఆమె రాణిస్తారని ఆకాంక్షించారు. ఉపసభాపతి పదవిని ప్రతిపక్ష పార్టీలకు కేటాయించే నూతన సంప్రదాయాన్ని నెలకొల్పాలని టీఆర్‌ఎస్ మినహా మిగ తా పార్టీల వారు తనను కోరారని కేసీఆర్ సభలో తెలిపారు. ఇదే విషయాన్ని రెండు, మూడు రోజుల ముందు చెప్పి ఉంటే బాగుండేదని చెప్పారు. అప్పటికే తాము అభ్యర్థిని ప్రకటించడం, సంతకాలు సేకరించడం పూర్తయిందన్నారు. ఇదే విషయాన్ని తాను వారికి చెప్పానన్న కేసీఆర్ ఉపసభాపతి ఏకగ్రీవ ఎన్నికకు సహకరించారని తెలిపారు. ఇందుకు సహకరించిన అన్ని పార్టీల నేతలకు కృతజ్ఞతలు
తెలిపారు. ఉపసభాపతిగా మహిళ ఎన్నిక కావడంతో పద్మాదేవేందర్‌రెడ్డి పేరు చరిత్రలో నిలిచిపోతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి అన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా మహిళ ఎన్నిక కావడం సంతోషదాయకమని, ఆమెకు కాంగ్రెస్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నాయకత్వంలో సభా సంప్రదాయాలు మరింత ఇనుమడించాలని అభిప్రాయపడ్డారు. మహిళల సమస్యలపై సభలో చర్చించేందుకు అవకాశం లభిస్తుందని ఆకాంక్షించారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ సభలో మాట్లాడే అవకాశం కల్పించాలని గీతారెడ్డి కోరారు. అనంతరం టీడీపీ యువ ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్ మాట్లాడుతూ ఉపసభాపతిగా ఎన్నికైన పద్మాదేవేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అధికార పక్షం కంటే విపక్షాలకే ఎక్కువ అవకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వంలోనూ మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
డెప్యూటీ స్పీకర్‌గా పద్మాదేవేందర్‌రెడ్డి





