Tuesday, 3 November 2026

అమరవీరుల కుటుంబాలపై పోటీ పెడ్తిరి

AMS_4082
మీరెట్ల గీ ముచ్చట్లు మాట్లాడ్తరు?
ఎర్రబెల్లికి హరీశ్‌ చురక
హైదరాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి) :
తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల కుటుం బాలకు తాము టికెట్లిస్తే పోటీ పెడ్తిరి, మీరు అమరుల కుటుం బాలకు టికెట్‌ ఇవ్వలేదని నీటిపారుదల, శాసన సభావ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలుగుదేశం పార్టీ
నేతలను కడిగి పడేశారు. అమరుల కుటుంబాను గెలింపించడంలో కాంగ్రెస్‌, టిడిపిలు చిత్తశుద్ధితో కృషి చేయలేదన్నారు. అసెంబ్లీ చర్చలో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ శంకరమ్మకు టికెట్‌ ఇస్తే టీడీపీ అభ్యర్థిని పోటీకి నిలబెట్టారని తెలిపారు. అమరులకు రాష్ట్రప్రభుత్వం తరపున నివాళులర్పించామన్నారు. సభలో మొట్టమొదటిగా అమరులను తలుచుకొని కేసీఆర్‌ స్పీచ్‌ మొదలు పెట్టారని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన ప్రతి అంశాన్ని అమలుపరుస్తమని ప్రకటించారు. ప్రతిపక్షాల సూచనలను తమ ప్రభుత్వం స్వీకరిస్తుందని హరీష్‌ రావు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూలన్నింటినీ నెరవేరుస్తామని స్పష్టం చేసారు. పంట రుణాల మాఫీ, ఉచిత నిర్బంధ విద్య, నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు, బలహీనవర్గాలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు వంటి హామీలన్నీ అమలు చేస్తామని ప్రకటించినట్లుగా అమలు చేస్తామన్నారు. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ చర్చను ప్రారంభించారు. ప్రభుత్వం చేపట్టబోయే కార్యాచరణను ఆయన ప్రకటించారు. రైతులకు లక్ష లోపు రుణం మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు శాస్త్రీయ అవగాహన లేకనే పంటల దిగుబడి తగ్గుతోందని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని హావిూ ఇచ్చారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. నిజామాబాద్‌లో పసుపు పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి 8 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తామని ఉద్ఘాటించారు. కరెంట్‌ సరఫరా విషయంలో గత ప్రభుత్వాలు మాట తప్పాయని, తాము మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి విద్యుత్‌ను అందిస్తామన్నారు. గత ప్రభుత్వాల నిర్వాకం వల్లే విద్యుత్‌ కొరత ఏర్పడిందని ఆయన విమర్శించారు. 4 వేల మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేస్తామని వెల్లడించిన ఆయన నిర్దిష్ట ప్రణాళికతో మూడేళ్లలో మిగులు విద్యుత్‌ సాధిస్తామన్నారు. కేజీ నుంచి పీజీ దాకా ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తామని తెలిపారు. నాణ్యమైన విలువలతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ ఆశించిన విధంగానే తెలంగాణలో విద్యను అందిస్తామని పునరుద్ఘాటించారు. ప్రతీ నియోజకవర్గానికి ఓ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేస్తామని వివరించారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో వైద్యరంగం దెబ్బతిందని విమర్శించారు. సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 24 గంటల సేవలు అందేలా చూస్తామన్నారు. సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సోమారపు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.లక్ష కోట్లు కేటాయిస్తుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనర్టీ వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. పేదలకు మూడెకరాల భూమిని అందజేస్తామన్నారు. ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్లు అందజేస్తామని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు వేతనాలు ఇస్తామని వివరించారు. అలాగే హెల్త్‌కార్డుల సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. సింగరేణిలో డిపెండెంట్‌ ఉద్యోగాలు తిరిగి అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆర్టీసీ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. ఐటీ, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షాల సహకారంతో తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆర్‌ఎన్‌ఎ): టీడీపీ అమరుల కుటుంబాలకు టికెట్‌ ఇవ్వలేదని నీటిపారుదల, శాసన సభావ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. అమరుల కుటుంబాను గెలింపించడంలో కాంగ్రెస్‌,టిడిపిలు చిత్తశుద్దితో కృషి చేయలేదన్నారు. అసెంబ్లీ చర్చలో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ శంకరమ్మకు టికెట్‌ ఇస్తే టీడీపీ అభ్యర్థిని పోటీకి నిలబెట్టారని తెలిపారు. అమరులకు రాష్ట్రప్రభుత్వం తరపున నివాళులర్పించామన్నారు. సభలో మొట్టమొదటిగా అమరులను తలుచుకొని కేసీఆర్‌ స్పీచ్‌ మొదలు పెట్టారని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన ప్రతి అంశాన్ని అమలుపరుస్తమని ప్రకటించారు. ప్రతిపక్షాల సూచనలను తమ ప్రభుత్వం స్వీకరిస్తుందని హరీష్‌ రావు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూలన్నింటినీ నెరవేరుస్తామని స్పష్టం చేసారు. పంట రుణాల మాఫీ, ఉచిత నిర్బంధ విద్య, నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు, బలహీనవర్గాలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు వంటి హావిూలన్నీ అమలు చేస్తామని ప్రకటించినట్లుగా అమలు చేస్తామన్నారు. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ చర్చను ప్రారంభించారు. ప్రభుత్వం చేపట్టబోయే కార్యాచరణను ఆయన ప్రకటించారు. రైతులకు లక్ష లోపు రుణం మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు శాస్త్రీయ అవగాహన లేకనే పంటల దిగుబడి తగ్గుతోందని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. నిజామాబాద్‌లో పసుపు పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి 8 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తామని ఉద్ఘాటించారు. కరెంట్‌ సరఫరా విషయంలో గత ప్రభుత్వాలు మాట తప్పాయని, తాము మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి విద్యుత్‌ను అందిస్తామన్నారు. గత ప్రభుత్వాల నిర్వాకం వల్లే విద్యుత్‌ కొరత ఏర్పడిందని ఆయన విమర్శించారు. 4 వేల మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేస్తామని వెల్లడించిన ఆయన నిర్దిష్ట ప్రణాళికతో మూడేళ్లలో మిగులు విద్యుత్‌ సాధిస్తామన్నారు. కేజీ నుంచి పీజీ దాకా ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తామని తెలిపారు. నాణ్యమైన విలువలతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ ఆశించిన విధంగానే తెలంగాణలో విద్యను అందిస్తామని పునరుద్ఘాటించారు. ప్రతీ నియోజకవర్గానికి ఓ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేస్తామని వివరించారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో వైద్యరంగం దెబ్బతిందని విమర్శించారు. సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 24 గంటల సేవలు అందేలా చూస్తామన్నారు. సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సోమారపు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.లక్ష కోట్లు కేటాయిస్తుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనర్టీ వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. పేదలకు మూడెకరాల భూమిని అందజేస్తామన్నారు. ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్లు అందజేస్తామని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు వేతనాలు ఇస్తామని వివరించారు. అలాగే హెల్త్‌కార్డుల సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. సింగరేణిలో డిపెండెంట్‌ ఉద్యోగాలు తిరిగి అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆర్టీసీ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. ఐటీ, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షాల సహకారంతో తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *