Monday, 2 November 2026

January 2013

హైదరాబాద్

రోడ్డుపై బైఠాయించిన ఓయూ విద్యార్థులు

హైదరాబాద్‌: హైదరాబాద్‌  పాతబస్తీలోని ఛత్రీనాక వద్ద ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి, ఓయూ విద్యార్ధిని హత్య కేసులో దోషులను త్వరగా పట్టుకోవాలని వారు ఆందోళన చేపట్టారు.

జాతీయం

జగన్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌పై ఈడీ విచారణ ప్రారంభం

న్యూఢిల్లీ : కడప ఎంపీ వైఎస్‌ జగన్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌పై ఎప్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ న్యాయప్రాధికార సంస్థలో ఈరోజు విచారణ ప్రారంభమైంది.

ఖమ్మం

అమృతహస్తం పథకాన్ని ప్రారంభించిన మంత్రి

ఖమ్మం : ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అమృత హస్తం పథకాన్ని ప్రారంభించారు. ఇల్లెందు ఐసీడీఎన్‌ పరిధిలో కామేపల్లి మండలం కొత్తలింగాల్లో పథకాన్ని ప్రారంభించిన ఆయన చిన్నారులకు పండ్లు పంచి వారితో కలిసి కొత్త…

వార్తలు

కుంభమేళా సందర్భంగా పర్యావరణంపై ప్రత్యేక సమావేశం : రాష్ట్రాల ముఖ్యమంత్రుల హాజరు

లక్నో : ఈ  నెలలో అలహాబాదులో జరగనున్న మహా కుంభమేళా సందర్భంగా పర్యావరణంపై ప్రత్యేకంగా రెండు రోజుల సమావేశం ఏర్పాటుచేయనున్నారు.  గంగానది పరిరక్షణకు సంబంధించి ఈ సమావేశంలో చర్చిస్తారు. జనవరి 18,19 తేదీల్లో జరిగే ఈ సమావేశాల్లో గంగానది…

హైదరాబాద్

ముగిసిన రాజీవ్‌ త్రివేది ట్రయథ్లాన్‌

హైదరాబాద్‌: భారత పోలీసు వ్యవస్థ ఏర్పడి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర పోలీసు క్రీడా విభాగం అదనపు డీజీ రాజీవ్‌ త్రివేది బృందం చేపట్టిన ట్రయథ్లాన్‌ హైదరాబాద్‌లో ముగిసింది. ఇందులో భాగంగా డిసెంబర్‌ 22 నుంచి విశాఖ…

సీమాంధ్ర

మాజీ కార్పొరేటర్‌ దారుణ హత్య

అనంతపురం : నగరంలో మాజీ కార్పొరేటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. జాతీయ రహదారి పక్కన ఉన్న పార్కులోకి ఉదయం నడకకు వెళ్లిన మాజీ కార్పొరేటర్‌  రామకృష్ణారెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో దాడి చేసి హతమార్చారు. గతంలో నక్సల్స్‌ ఉద్యమంలో…

జాతీయం

పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం

న్యూఢిల్లీ : పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై పొగమంచు పేరు కుపోవడంతో 14 విమాన సర్వీసులను రద్దు చేశారు. 15 సర్వీసుల సమయాల్లో మార్పులు చేశారు. పొగమంచు కారణంగా నిన్న…

జాతీయం

నేడు ఢిల్లీ పోలీసులకు పోస్టుమార్టమ్‌ నివేదిక

న్యూఢిల్లీ : సామూహిక అత్యాచారానికి గురై సింగపూర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వైద్య విద్యార్థిని పోస్టుమార్టమ్‌ నివేదిక నేడు ఢిల్లీ పోలీసులకు అందనుంది. సింగపూర్‌లో యువతి చికిత్స పొందిన మౌంట్‌ ఎలిజబెత్‌ ఆసుపత్రి నుంచి ఈ…

సీమాంధ్ర

వేడుకల్లో విషాదం.. పలు జిల్లాల్లో ఆరుగురి మృతి

అనంతపురం : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పలు జిల్లాల్లో అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. అనంతపురంలోని శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి…

హైదరాబాద్

రాష్ట్రపతిని కలిసిన గవర్నర్‌, సీఎం

హైదరాబాద్‌ : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఉదయం కలిశారు. నేటితో రాష్ట్రంలో రాష్ట్రపతి శీతాకాల విడిది పూర్తికానుంది. ఈ మధ్యాహ్నం రాష్ట్రపతి ఢిల్లీ వెళ్లనున్నారు.