Thursday, 5 November 2026

February 2013

హైదరాబాద్

చర్లపల్లి జైల్లో గంజాయి స్వాధీనం

హైదరాబాద్‌: చర్లపల్లి జైల్లోని బ్రహ్మపుత్ర బ్యారక్‌లో జైలు అధికారులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదయం తనిఖీలు చేపట్టి ఓ ఖైదీ వద్ద గంజాయి ఉన్నట్లు గుర్తించినట్లు జైలు అధికారులు తెలిపారు. దీనిపై విచారణ చేపట్టినట్లు చెప్పారు.

హైదరాబాద్

తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల భేటీ వాయిదా

హైదరాబాద్‌: నేడు జరగాల్సిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం వాయిదా పడింది. వాయిదాకు గల కారణాలు తెలియరాలేదు. త్వరలోనే ఎంపీలు సమావేశమై పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారని నేతలు తెలిపారు.

ఆదిలాబాద్

పట్టాలపై కూలిన చెట్లు.. పలు రైళ్ల నిలిపివేత

ఆదిలాబాద్‌: ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలకు రెబ్బెన మండలం రాళ్ల పేట రైల్వేస్టేషన్‌ వద్ద పట్టాలపై చెట్లు కూలిపడ్డాయి. దీంతో కాగజ్‌నగర్‌లో భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌, సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లను, సిర్పూర్‌ టీలో ప్యాసింజర్‌ రైలును నిలిపి వేశారు. రైల్వే…

హైదరాబాద్

సెక్యూరిటీ గార్డు హత్య

హైదరాబాద్‌: కూకట్‌పల్లి సమీపంలోని కైక్లాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ సెక్యూరిటీ గార్డ్‌ హత్యకు గురయ్యాడు. అపార్ట్‌మెంట్‌ వద్ద అతడి మృతదేహాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

కరీంనగర్

కరీంనగర్‌ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు

– దెబ్బతిన్న పంటలు కరీంనగర్‌: జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కోరుట్ల, మెట్‌పల్లి మండల్లాల్లో 20 వేలు ఎకారాల్లో పంటనష్టం జరిగింది. మేడిపల్లి  మండలంలో వడగళ్ల వానతో 1500 ఎకరాల్లో…

ఖమ్మం

కలుషిత ఆహారంతో విద్యార్థులకు అస్వస్థత

పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచలోని గురుకుల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం చేసిన తర్వాత పలువురు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. దీంతో విద్యార్థులను పాఠశాల సిబ్బంది పాల్వంచ…

హైదరాబాద్

నకిలీ పాన్‌పోర్టులతో ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో నకిలీ పాన్‌పోర్టులతో దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఇద్దరిని విమానాశ్రయ అధికారులు అరెస్ట్‌ చేశారు. వీరిని మెదక్‌ జిల్లా వాసులుగా గుర్తించారు.

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

విజయవాడ: కృష్ణలంక జాతీయ రహదారిపై నల్లగాటి వద్ద ఈ తెల్లవారుజామున లారీ, టాటా ఏన్‌ వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికీ తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు.

Featured News

గెలుపే లక్ష్యంగా పనిచేయండి

– కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేయండి – సీఎల్పీ, పీసీసీ, సీఎంల సమావేశంలో రాహుల్‌న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) : గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పిలుపు నిచ్చారు. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ…